Brinjal Cultivation : వంగ తోటల్లో కాయతొలుచు పురుగుల ఉధృతి.. నివారణకు అధికారుల సూచనలు

Brinjal Cultivation : తెలుగు రాష్ట్రాల్లో వంగను సుమారు లక్ష  ఎకరాల్లో సాగుచేస్తున్నారు. సంవత్సరం పొడవునా వంగ సాగుచేయవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 2,500 నుండి 3 వేల హెక్టార్ల వరకు వంగ సాగవుతుంది.

Brinjal Cultivation

Brinjal Cultivation : కోసిన కొద్దీ కాపు కాస్తూ… టన్నుల కొద్దీ దిగుబడినిచ్చే  పంట వంగ . కూరగాయల్లో దీనిది విశిష్ఠ స్థానం. 6 నెలల పంటకాలంతో… వంగసాగు రైతుకు మంచి ఆదాయ వనరుగా మారింది. కానీ ఇటీవలి కాలంలో  ఈ పంటలో మొవ్వు, కాయతొలుచు పురుగుల బెడద ఎక్కువవటం రైతులకు ఆందోళన కలిగిస్తోంది. వీటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఉద్యానశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ .

తెలుగు రాష్ట్రాల్లో వంగను సుమారు లక్ష  ఎకరాల్లో సాగుచేస్తున్నారు. సంవత్సరం పొడవునా వంగ సాగుచేయవచ్చు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 2,500 నుండి 3 వేల హెక్టార్ల వరకు వంగ సాగవుతుంది. వేసవిలో ఫిబ్రవరి నుంచి మార్చి  మొదటివారం వరకు నాటతారు.

ప్రస్థుతం మార్కెట్లో వివిధ హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి రావటం వల్ల ఎకరాకు 10-20 టన్నుల వరకు దిగుబడి సాధించే అవకాశం ఏర్పడింది. అయితే వంగతోటకు ప్రధాన బెడద అయిన కాయతొలుచుపురుగు. ఈ పురుగు ఆశిస్తే 11 -90 శాతం వరకు పంట నష్టపోవాల్సిందే. దీనిని గుర్తించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. మరి వాటి నివారణ చర్యలేంటో శ్రీకాకుళం జిల్లా ఉద్యానశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ ద్వారా తెలుసుకుందాం.

Read Also : Vegetable Nursery : కూరగాయల నారుపెంపకాన్ని ఉపాధిగా మార్చుకున్న రైతు

ట్రెండింగ్ వార్తలు