Vegetable Nursery : కూరగాయల నారుపెంపకాన్ని ఉపాధిగా మార్చుకున్న రైతు
Vegetable Nursery : కూరగాయల సాగులో నారుపోసి నాటుకోవటం సర్వసాధారణంగా జరుగుతుంది. సంప్రదాయ పద్ధతిలో నారు పెంచటం వల్ల ఏమాత్రం వాతావరణ ఒడిదుడుకులు సకాలంలో నాటు వేసే పరిస్థితి వుండదు.

Vegetable Nursery
Vegetable Nursery : ఏ కూరగాయ పంట దిగుబడి అయినా.. ఆరోగ్యవంతమైన నారుమడి పెంచడంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే కూరగాయ పంటలు సాగుచేసే రైతులు… సంప్రదాయ పద్ధతులకు స్వస్తిపలికారు. తక్కువ సమయంలో నాణ్యమైన అధిక దిగుబడులను తీసి, ఆదాయం గడించాలనే ఉద్దేశంతో నర్సరీ నారుమొక్కల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే అనేక నర్సరీలు వెలుగొందాయి. నర్సరీల నిర్వహణలో లాభాలు కూడా అదేస్థాయిలో ఉండటంతో 20 ఏళ్లుగా కూరగాయ నర్సరీని నిర్వహిస్తూ.. మంచి లాభాలను ఆర్జిస్తున్నారు బాపట్ల జిల్లాకు చెందిన ఓ రైతు.
Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు
మారుతున్న కాలానికి అనుగుణంగా సాగు విధానంలో రైతులు కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. సంప్రదాయ విధానాలకు స్వస్తీ పలికి ఆధునిక పద్ధతులు పాటిస్తున్నారు. ఇప్పుడు నూటికి 90 శాతంమంది రైతులు హైబ్రిడ్ విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రతి విత్తనాన్ని మొక్కగా మొలిచేటట్లు చూసుకోవాలి.
అందుకే, విత్తు దగ్గరే చిత్తు కాకుండా నర్సరీల్లో పెంచిన నారును నమ్ముకుంటున్నారు. రైతుల ఆసక్తికి అనుగుణంగా ఇటీవల కాలంలో నర్సరీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ కోవలోనే బాపట్ల జిల్లా, మార్టూరు మండలం, బొబ్బెపల్లి గ్రామానికి చెందిన రైతు దండా వీరాంజనేయులు 20 ఏళ్ళుగా షేడ్ నెట్ నర్సరీలో ప్రోట్రేలను ఏర్పాటు చేసి , వీరాంజనేయ నర్సరీ పేరుతో కూరగాయల నార్లను పెంచుతున్నారు.
కూరగాయల సాగులో నారుపోసి నాటుకోవటం సర్వసాధారణంగా జరుగుతుంది. సంప్రదాయ పద్ధతిలో నారు పెంచటం వల్ల ఏమాత్రం వాతావరణ ఒడిదుడుకులు ఎదురైనా నారు దెబ్బతినటం వల్ల, సకాలంలో నాటు వేసే పరిస్థితి వుండదు. దీనివల్ల రైతుకు శ్రమ, ఖర్చు పెరగటంతోపాటు, పంటకాలం కూడా వృధా అవుతుంది. అందుకే షేడ్ నెట్ లలో నారుపెంచే నర్సరీలను ఆశ్రయిస్తున్నారు రైతులు. నర్సరీ నిర్వహకులు కూడా ప్రతి విత్తనాన్ని మొలిచేలా జాగ్రతలు తీసుకుంటున్నారు.
సంప్రదాయ పద్ధతిలో కంటే ప్రోట్రేలలో నారును పెంచటం వలన ప్రతీ విత్తనం నారుమొక్కగా అందివస్తుంది. షేడ్ నెట్ లలో వాతావరణం నియంత్రణలో వుంటుంది కనుక చీడపీడలు సోకే అవకాశం చాలా తక్కువగా వుంటుంది.నారు మొక్కల్లో వేరువ్యవస్థ సమానంగా పెరగటం వల్ల ప్రధానపొలంలో నాటినపుడు ఎలాంటి ఒత్తిడికి గురికావు. నాటిన వెంటనే పెరుగుదలకు అవకాశం వుంటుంది కనుకు దిగుబడులు ఆశాజనకంగా వుంటాయి.
Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు