Castor Cultivation : రబీకి అనువైన ఆముదం రకాలు.. అధిక దిగుబడుల కోసం సాగులో చేపట్టాల్సిన యాజమాన్యం

సబ్బులు, డిటర్జంట్లు వంటి వాటిల్లో కూడా వాడుతుండడంతో దేశంలో ఆముదం పంటకు ప్రాధాన్యత పెరిగింది. ఈ పంట ఉప ఉత్పత్తుల వల్ల భారత దేశానికి ఏటా 5వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభించటం విశేషం.  

Castor Varieties

Castor Cultivation : ఏ పంటాలేనిచోట ఆముదం చెట్టే మహావృక్షం అంటారు. ఇది ఒక్కప్పటి మాట. కానీ నేడు, అధికదిగుబడినిచ్చే వంగడాల రాకతో… నీటి ఎద్దడి పరిస్థితులను తట్టుకుని మెట్టప్రాంత రైతులకు మంచి ఆదాయాన్నిస్తోంది ఈపంట. దేశంలో పండించే వాణిజ్య పంటల్లో ఆముదం తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ముఖ్యంగా ఖరీప్ లో కంటే రబీలో, నీటివసతి కింద, ఈ పంట నుంచి అధిక దిగుబడులు సాధించవచ్చని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.  ఈ కాలంలో హైబ్రిడ్ రకాల సాగుకు అనువుగా వుండటం వల్ల ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చు.  ఆరుతడి పంటగా ఆముదం సాగుతో మెట్ట రైతు మంచి ఆర్ధిక ప్రగతి సాధించవచ్చని సూచిస్తున్నారూ పాలెం వ్యవసాయ పరిశోధనా స్థానం  శాస్త్రవేత్త సదయ్య.

READ ALSO : Pest Control : పత్తిలో పెరిగిన తెగుళ్ల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ఆముదం విస్తీర్ణం, ఉత్పత్తిలో ప్రపంచంలోనే మన దేశం ప్రథమ స్థానంలో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షల హెక్టార్లలో సాగవుతుంది.  తెలంగాణలో మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో సాగవుతుండగా, ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో దీని విస్తీర్ణం వుంది.  ఆముదం నూనెను వైమానిక రంగంలో, జెట్‌, రాకెట్‌పరిశ్రమల్లో లూబ్రికెంట్‌గానూ, పాలిష్‌లు, ఆయింట్‌మెంట్లు , మందుల తయారీల్లోనూ, డీజిల్‌పంపుసెట్లలో డీజిల్‌కు ప్రత్యమ్నాయ ఇంధనంగా ఉపయోగిస్తున్నారు.

READ ALSO : Lung Cancer : పురుషులలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రారంభ సంకేతాలు ఇవే ?

సబ్బులు, డిటర్జంట్లు వంటి వాటిల్లో కూడా వాడుతుండడంతో దేశంలో ఆముదం పంటకు ప్రాధాన్యత పెరిగింది. ఈ పంట ఉప ఉత్పత్తుల వల్ల భారత దేశానికి ఏటా 5వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభించటం విశేషం.  ఈ ఖరీఫ్ లో రుతుపవనాలు సకాలంలో రావడం వల్ల పంటలను కూడా సకాలంలో విత్తారు రైతులు . అయితే  పంట చేతికొచ్చే సమయంలో వచ్చిన అధిక వర్షాలకు చాలా ప్రాంతాల్లో పంట దెబ్బతిన్నాయి . సాధారణంగా రబీలో ఆముదం ను అక్టోబర్ చివరి వరకే విత్తుకోవాలి. కానీ ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో నవంబర్ మొదటి వారం వరకు విత్తుకోవచ్చు. ముఖ్యంగా  మురుగు నీరు నిల్వ ఉన్న భూములు, చౌడు భూములు తప్పా, అన్ని నేలలు ఈ పంటకు సాగుకు అనుకూలం.

READ ALSO : Castor Cultivation : వర్షాధారంగా ఆముదం సాగులో అధిక దిగుబడులు

రబీలో ఆముదం సాగుచేసే రైతులు కొన్ని మెళకువలు పాటిస్తే మంచి దిగుబడులను తీయవచ్చనం చెబుతున్నారు  పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త, డా. కె . సదయ్య. ఆముదం పంటలో సరైన ఎరువులు, నీటి యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులను తీయవచ్చు. పంట పెరుగుదలలో వచ్చే చీడపీడలను గుర్తించి శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లైతే  మంచి దిగుబడులు వస్తాయి.