Cattle Diseases : వర్షాకాలంలో పశువులకు వచ్చే వ్యాధులు.. రైతులు పాటించాల్సిన ముందస్తు జాగ్రత్తలు

పశువులకు మేయడానికి మేత, తాగడానికి శుభ్రమైన నీరు లభించదు. దీంతో అనారోగ్యానికి గురవుతాయి. రోగ నిరోధక శక్తి తగ్గి వ్యాధుల బారిన పడుతాయి. వ్యాధి సోకిన పశువుల మందలో వెళ్లినప్పుడు ఇతర పశువులకు కూడా వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది.

Rainy Season Diseases

Cattle Diseases : వర్షాకాలంలో  పశువులకు వివిధ వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. పశు పోషకులు, రైతులు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా పశువులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. తగు జాగ్రత్తలతో పశువుల ఆరోగ్యాన్ని  కాపాడుకోవచ్చు. ఈ తరుణంలో వర్షాకాలంలో పశువులకు సోకే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు ప్రకాశం జిల్లా పశువైద్య సహాయ సంచాలకులు డా. బి. బసవ శకంర్ రావు.

READ ALSO : Paddy Cultivation : ఖరీఫ్ వరి నారుమడులు పోస్తున్న రైతులు.. నాణ్యమైన నారుకోసం మేలైన యాజమాన్యం

మానవ మనుగడకు ప్రకృతి సంపదతో పాటు పశుసంపద కూడా చాలా ముఖ్యం. ప్రత్యక్షంగా, పరోక్షంగా మానవ సమాజానికి పశుసంపద ఎన్నో విధాలుగా మేలు చేస్తున్నది. కాలానికి అనుగుణంగా ఆరోగ్యంపై మనుషులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో పశువులకు కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వానకాలంలో కురిసే వర్షాలతో నీటి పరిసరాలు, వాతావరణం కలుషితమవుతాయి.

READ ALSO : Dried Mango Slices : మామిడి ఒరుగుల తయారీ.. 3 నెలల్లో 12 కోట్ల టర్నోవర్

పశువులకు మేయడానికి మేత, తాగడానికి శుభ్రమైన నీరు లభించదు. దీంతో అనారోగ్యానికి గురవుతాయి. రోగ నిరోధక శక్తి తగ్గి వ్యాధుల బారిన పడుతాయి. వ్యాధి సోకిన పశువుల మందలో వెళ్లినప్పుడు ఇతర పశువులకు కూడా వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. వ్యాధి సోకిన పశువుల మలమూత్రాలు, నోరు, కళ్ల నుంచి వచ్చే ద్రవాల ద్వారా కూడా ఇతర పశువులు వ్యాధిబారిన పడుతాయి.

READ ALSO : Kanda Yam Cultivation : కంద సాగుతో మంచి ఆదాయం.. అధిక దిగుబడుల కోసం యాజమాన్య పద్ధతులు

సీజనల్‌ వ్యాధులను రైతులు కనిపెడుతూ.. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే వానకాలంలో వచ్చే రోగాల నుంచి పశువులను కాపాడుకోవచ్చు. అంతే కాదు తొలి దశలోనే పశువులకు వచ్చిన రోగాన్ని గుర్తిస్తే కొంతమేరకు నష్ట నివారణ చర్యలు చేపట్టవచ్చని ఒంగోలు పశు సంవర్థక శాఖ సహాయ సంచాలకులు, డా. బి. బసవ శకంర్ రావు.

READ ALSO : Summer Ploughing : వేసవి దుక్కులతో తెగుళ్లకు చెక్

పాడి రైతులు వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతే కాదు పశువులకు వచ్చే వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి. వ్యాధి సోకిన వెంటనే అందుబాటులో ఉన్న పశువైద్యులను సంప్రదించాలి. ముందు జాగ్రత్తగా టీకాలు వేయించాలి.