Summer Ploughing : వేసవి దుక్కులతో తెగుళ్లకు చెక్

వేసవి దుక్కులకు సమయం కూడా తక్కువగా ఉంది. వేసవి దుక్కుల వల్ల భూమి పైపొరలు కిందికి, కింది పొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా మారుతుంది.

Summer Ploughing : వేసవి దుక్కులతో తెగుళ్లకు చెక్

Polugs Cultivation Process In Summer

Summer Ploughing : ఖరీఫ్ పంటల్లో అధిక దిగుబడులు సాధించాలంటే వేసవి దుక్కులు తప్పనిసరి. చాలా మంది రైతులు..తొలకరి వర్షాలకు వ్యవసాయ భూములను దున్నుతుంటారు. అలా చేయడం వల్ల భూమిలో నీరు ఇంకిపోకుండా బయటకు వెళ్తుంది. ముందుగానే వేసవి దుక్కులు వేస్తే.. భూమి కోతకు గురికాకుండా ఉంటుంది.

READ ALSO : AGRICULTURE : దుక్కులు దున్నేందుకు ఇదే సరైన కాలం!

ప్రస్తుతం వానకాలం దగ్గర పడుతుంది. ఖాళీగా ఉన్న భూముల్లో రైతులు వేసవి దుక్కులు చేయడం వల్లే కలిగే ప్రయోజనాల గురించి తెలియజేస్తున్నారు, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా.ఆర్.శ్రావణ్ కుమార్.

READ ALSO : Good For Crops : పంటలకు మేలు చేసే….వేసవి దుక్కులు..

సాధారణంగా రైతులు యాసంగి పంటలు పూర్తికాగానే.. భూములను ఖాళీగా వదిలేస్తారు. దీంతో కలుపు పేరుకుపోవడంతో పాటు.. భూమికి సత్తువ లేకుండా చేస్తాయి. ఫలితంగా భూసారం కోల్పోడమే కాకుండా భూమి లోపలి పొరల నుంచి నీరు ఆవిరై పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే కేరళను రుతుపవనాలు తాకాయి.

READ ALSO : Summer Ploughing : వేసవి దుక్కులతో.. తగ్గనున్న పెట్టుబడులు

మరికొద్ది రోజుల్లో తొలకరి వర్షాలు పడే అవకాశం ఉంది. కావున వేసవి దుక్కులకు సమయం కూడా తక్కువగా ఉంది. వేసవి దుక్కుల వల్ల భూమి పైపొరలు కిందికి, కింది పొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా మారుతుంది. ఇలా భూమిలో తేమ శాతం పెరిగి, భూసారం అభివృద్ధి చెంది, పురుగులు, తెగుళ్లు, కలుపు మొక్కల నివారణకు ప్రయోజనాలు సమకూరుతాయి.

READ ALSO : Varieties Suitable for Kharif : ఖరీఫ్ కు అనువైన దొడ్డుగింజ రకాలు

అలాగే వేసవి దుక్కులు దున్నే ముందు చెరువు మట్టి , పశువులు వ్యర్థాలను వేయడం ద్వారా భూమి గుల్లగామారుతుంది. దీంతో ఖరీఫ్ సాగు అనుకూలంగా ఉంటుందని తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా.ఆర్.శ్రావణ్ కుమార్.