Chilli Crop Cultivation
Chilli Crop Cultivation : ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల మిరపతోటల్లో బూడిద తెగులు ఉధృతంగా వ్యాపిస్తింది. దీనివల్ల మిరప రైతు తీవ్రంగా నష్టపోతున్నారు. ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో మిరపలో బూడిద తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. రెండో కోతకు సిద్ధంగా ఉన్న ఈ తరుణంలో దిగుబడికి నష్టం వాటిల్లకుండా రైతులు సత్వర నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డా. జె. హేమంత్ కుమార్.
ప్రధాన వాణిజ్య పంటగా సాగవుతున్న మిరప, మెట్టప్రాంత రైతుల ఆదరణ పొందుతోంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కోతలు కూడా మొదలయ్యాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో దాదాపు 21 వేల హెక్లార్లలో మిర్చి సాగవుతోంది. మొదటి కోత అయిపోయి, రెండోకోతకు సిద్ధంగా ఉంది.
Read Also : Groundnut Cultivation : రబీ వేరుశనగ పంటలో చీడపీడల బెడద.. ఈ సులభ పద్ధతులతో సులభంగా నివారించవచ్చు..!
అయితే, ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా చాలా బూడిద తెగులు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. బూడిద తెగులు నివారణ పట్ల రైతులు తగిన శ్రద్ద కనబరిచి తోటలను రక్షించుకోవాలని సూచిస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డా. జె.హేమంత్ కుమార్.