Groundnut Cultivation : రబీ వేరుశనగ పంటలో చీడపీడల బెడద.. ఈ సులభ పద్ధతులతో సులభంగా నివారించవచ్చు..!
Groundnut Cultivation : ప్రస్తుతం చాలా చోట్ల వేరుశగన పంటకు చీడపీడల తాకిడి అధికమైందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటి నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులను చేపట్టాలని సూచిస్తున్నారు.

Groundnut Cultivation
Groundnut Cultivation : రబీలో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో చాలా వరకు రైతులు వేరుశనగను సాగు చేశారు. 30 నుండి 70 రోజుల దశలో పంట ఉంది. అయితే ఈ పంటకు తెగుళ్లు , పురుగులు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.. కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రబీలో నూనెగింజల పంటల్లో ప్రధాన పంట వేరుశనగ . గతంలో వర్షాకాలంలో అధికంగా సాగుచేసేవారు. అయితే రకరకాల కారణాల వల్ల సరైన దిగుబడులు రాకపోవడంతో , నీటి వసతి గల ప్రాంతాల్లో రబీ పంటగా సాగుచేస్తున్నారు.
Read Also : Cow Dung : ఆవు పేడతో బిజినెస్ చేస్తున్న మహిళ.. 10 మందికి ఉపాధినిస్తూ.. అమెరికాకి కూడా..
వివిధ ప్రాంతాల్లో 30 రోజుల నుండి 75 రోజుల దశ వరకు ఉంది. ప్రస్తుతం చాలా చోట్ల వేరుశగన పంటకు చీడపీడల తాకిడి అధికమైందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటి నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులను చేపట్టాలని సూచిస్తున్నారు.. కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి.
రసంపీల్చే పురుగుల నివారణ
ఇమిడాక్లోప్రిడ్ (గౌచ్) 5 మి. లీ. 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి
రసంపీల్చే పురుగుల నివారణ
ఫిప్రోనిల్ 2 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
తెల్లదోమ నివారణ
ఢయాఫెన్ థ్యూరాన్ 1 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
రసంపీల్చే పురుగుల నివారణ
ఎకరాకు ఉలాల లేదా ఫ్లోమికామిడ్ 80 గ్రా. 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి
పొగాకు లద్దెపురుగు, ఆకుతినే పురుగుల నివారణ
ఇమామెక్టిమ్ బెంజోయేట్ లేదా టెట్రానిలిప్రోల్ పిచికారి చేయాలి
పొగాకు లద్దెపురుగు నివారణ
ఎకరాకు లింగాకర్షక బుట్టలు 8 ఏర్పాటు చేసుకోవాలి
వేరుపురుగు నివారణ :
బవేరియా బాసియానా లేదా మెటారైజమ్ 5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
వేరుపురుగు నివారణ :
క్లోరిఫైరిపాస్ 2.5 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
కాండంకుళ్లు తెగులు నివారణ :
కాపర్ ఆక్సీ క్లోరైడ్ (బ్లైటాక్స్) లేదా కార్బెండిజమ్ + మ్యాంకోజెబ్ (సాఫ్)లేదా స్ప్రింట్ పిచికారి చేయాలి.