Chocolate Making : చాక్లెట్ తయారీలో శిక్షణ

Chocolate Making : పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఇవి ప్రాంతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా అందరి నోళ్లను తీపి చేస్తున్నాయి.

Chocolate Making Training in Telugu

Chocolate Making : మహిళలు స్వయం సమృద్ధి ద్వారా ఆర్ధికంగా పరిపుష్టం కావడానికి డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యానవర్సిటీ  శిక్షణ ఇస్తోంది. ఇందులో భాగంగానే భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద విడుదల చేసిన నిధులతో చాక్లెట్ల తయారీ పై  నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇక్కడ శిక్షణ పొందిన మహిళలు ఇంటి వద్దే కుటీరపరిశ్రమ ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందేందుకు అవకాశం కల్పిస్తున్నారు.

చాక్లెట్లు.. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ప్రీతిపాత్రం. నోట్లో వేసుకోగానే కరిగిపోయే మృదు మధురమైన చాక్లెట్లను ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. ఇవి లేకుండా కొన్ని వేడుకలకు నిండుదనం రాదు. మిఠాయిల స్థానంలో చాక్లెట్లను కానుకగా ఇచ్చే సంప్రదాయం ఎప్పుడో మొదలైంది.

పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఇవి ప్రాంతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా అందరి నోళ్లను తీపి చేస్తున్నాయి. భిన్న రకాల చాక్లెట్లను రుచి చూడడమే కాదు, వాటి తయారీపై ఆసక్తి ఉన్నవారు ఈ రంగంలోకి నిరభ్యంతరంగా ప్రవేశించొచ్చు. చాక్లెట్ల వ్యాపారం నానాటికీ విస్తరిస్తుండడంతో నిపుణులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రధానంగా ఇందులో మహిళలకు ఎన్నో అవకాశాలున్నాయి.

ముఖ్యంగా భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద విడుదల చేసిన నిధులతో.. పశ్చిమగోదావరి జిల్లా, వెంకటరామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యానవర్సిటీలో స్వచ్ఛమైన చాక్లెట్ల తయారీపై నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తోంది. ఆసక్తి ఉన్నవారు శిక్షణకు హాజరు కావచ్చని సూచిస్తున్నారు.

చాక్లెట్ అంటే ఎవరికైనా నోరూరుతుంది. పెరిగిన డిమాండ్‌తో వీటి ధరలు కూడా పెరిగాయి. దీంతో ఇటీవల చాక్లెట్ మేకింగ్‌ను నేర్చుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కేవలం హాబీగానే కాకుండా మహిళలు దీన్ని ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. వీటి తయారీలో సృజనాత్మకత, నైపుణ్యాన్ని జోడిస్తే వినియోగదారుల నుంచి ఆదరణ లభిస్తుంది.

Read Also : Agri Info : ఏ గ్రేడ్ మోడల్‎లో వరి‎గట్లపై కూరగాయల సాగు