Agri Info : ఏ గ్రేడ్ మోడల్లో వరిగట్లపై కూరగాయల సాగు
Agri Info : కూరగాయలు సాగు చేస్తూ... వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ రైతు. లాభాలు గడిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Matti Manishi
Agri Info : సాగులో నూతన పద్ధతులను పాటిస్తున్నారు కొందరు రైతులు. సంప్రదాయ పంటలు పండిస్తూనే… రోజువారీ ఖర్చుల కోసం కూరగాయల పండిస్తున్నారు. ఈ కోవలోనే పొలం గట్లపైన కూరగాయలు సాగు చేస్తూ… వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ రైతు. లాభాలు గడిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
కూరగాయల ధరలు ఆకాశానంటుతున్న వేళ పంటల సాగులో కొత్త పద్ధతులను పాటిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రైతులు. ప్రధాన పంటలైన వరి, పసుపు, మొక్కజొన్న, సోయా, చెరుకు తదితర పంటలను సాగు చేస్తుంటారు. అధిక పెట్టుబడులు పెట్టి ఫలితాలు పొందాలంటే సమయం పడుతుంది. ఈ క్రమంలో అంతరపంటలుగా కూరగాయలు వేస్తూ… రోజువారీ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు.
ముఖ్యంగా వ్యవసాయశాఖ అధికారుల సూచనల మేరకు వరి, చెరకు పండిస్తూనే.. రోజువారి వారి అవసరాల కోసం పొలం గట్టును ఉపయోగించుకొని కూరగాయలను పండిస్తున్నారు. ఖాళీ స్థలాన్ని వదిలేయకుండా తీగజాతి కూరగాయ మొక్కలను పెంచుతున్నారు. వచ్చిన దిగుబడిని ఇంటి అవసరాలకు పోను.. స్థానిక మార్కెట్ లో అమ్ముతూ… వచ్చిన డబ్బును ప్రధాన పంటలకు కొంత పెట్టుబడిగా పెడుతున్నారు.