Cluster Beans Cultivation
Goruchikkudu Sagu : మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంత రైతులు కూడా కూరగాయల సాగుపై మక్కువ పెంచుకుంటున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందేలా పంటలు పండిస్తున్నారు. ఇందుకు నిదర్శనమే ప్రకాశం జిల్లా, హనుమంతునిపాడు మండలం, వాలచర్ల గ్రామం. దాదాపు 100 ఎకరాల్లో రైతులు ముకుమ్మడిగా గోరుచిక్కుడు పండిస్తు.. మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.
Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు
కూరగాయల సాగు నేటి తరం రైతులకు లాభదాయకంగా ఉంటుంది. తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో రైతు ఆశించిన స్థాయిలో లాభం పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇది గమనించిన జిల్లా, హనుమంతునిపాడు మండలం, వాలచర్ల గ్రామరైతులు 10 ఏళ్లుగా కూరగాయలను పండిస్తూ… మంచి దిగుబడులను తీస్తున్నారు.
ముఖ్యంగా మార్కెట్ లో గోరుచిక్కుడకు నిలకడమైన ధరలు ఉంటుండటంతో ఈ గ్రామంలో ప్రతి రైతు గోరుచిక్కుడు ను సాగుచేస్తుంటారు. దాదాపు ఈ ఒక్క గ్రామంలోనే 100 ఎకరాల్లో ఈ పంటను సాగుచేస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. పెద్దగా చీడపీడలు ఉండవు. ఈ పంట వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పటికీ నీటి ఎద్దడిని తట్టుకుని కచ్చిత దిగుబడిని ఇస్తుంది. కాబట్టి రైతు ఆదినారాయణ రెడ్డి గత 10 ఏళ్లుగా గోరుచిక్కుడును సాగుచేసి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.
గోరుచిక్కుడు పంట కాలం 4 నెలలు. నాటిన 60 రోజుల నుండి పంట దిగుబడి ప్రారంభమవుతుంది. 8 నుండి 10 రోజులకు ఇక కోతకోస్తుంటారు. ఇలా పంట పూర్తయ్యే సరికి 5 నుండి 6 కోతలు వస్తాయి. కోసిన ప్రతి సారి తక్కువలో తక్కువ 10 క్వింటాల దిగుబడి వస్తుంది. అంటే ఎకరాకు 50 నుండి 60 క్వింటాళ్ల దిగుబడి అన్నమాట. మార్కెట్ లో సగటు కిలో ధర 20 రూపాయలు వేసుకున్నా… రూ 1 లక్షా 20 వేల ఆదాయం వస్తుంది.
Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..