Vari Narumadi : వరి నారుమళ్లలో ఎదుగుదల లోపం.. మంచు నుంచి నారు సంరక్షణకు చర్యలేంటి?

Vari Narumadi : రబీ వరిసాగు చేసే రైతులు ఇప్పటికే నారుమళ్లు పోసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నారు పోసుకుంటున్నారు. 

Comprehensive Ownership in Rice Narumadi

Vari Narumadi : నీటివసతి కింద, రబీ వరిసాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలా వరకు నార్లు పోసుకున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా పోసుకోవడానికి సిద్దమవుతున్నారు. అయితే చాలాప్రాంతాల్లో శీతల గాలులు, మంచు ప్రభావం వల్ల వరి నారుమళ్లలో ఎదుగుదల లేక  రైతులు ఆందోళన చెందుతున్నారు.

Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు

మంచు అధికంగా వున్నప్పుడు  ఏటా ఈ పరిస్థితి ఎక్కువ కనిపిస్తోంది. వరి విత్తనం నారుమడిలో చల్లేముందు నుంచి తగిన మెళకువలు పాటిస్తే, నారు సకాలంలో చేతికి అంది, నారు ముదరకముందే నాట్లు వేసుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.  మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

రబీ వరిసాగు చేసే రైతులు ఇప్పటికే నారుమళ్లు పోసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నారు పోసుకుంటున్నారు.  అయితే  రాత్రి పూట ఉష్ణోగ్రతులు పడిపోతున్నాయి. ఈ ప్రభావం వరినారుమడులపై పడే అవకాశం ఉంది. చల్లగాలులు, మంచు నుండి, నారును సంరక్షించుకుంటే ఆరోగ్యంగా పెరిగి సకాలంలో చేతికి అందుతుంది. ఇందుకు నారుమడి పోసేటప్పటినుండి రైతులు తగిన మెళకువలు పాటించాలంటారు  రాజేందర్ నగర్ వరి పరిశోధనాస్థానం శాస్త్రవేత్త.

Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..