Intercrop In Cashew : జీడిమామిడిలో అంతర పంటగా పత్తిసాగు

ఎక్కువగా మామిడి, బొప్పాయి, అరటి పంటలు సాగు చేసే రైతులు అంతర పంటలుగా వివిధ రకాల కూరగాయలు పంటలను ప్రకృతి విధానంలో సాగుచేస్తూ.. పెట్టుబడి తగ్గించుకుంటూ.. అధిక లాభాలను పొందుతున్నారు.

Intercrop In Cashew : రైతులు తమ వ్యవసాయ పద్ధతుల విధానంలో మార్పులు చేసుకుంటున్నారు. తక్కువ శ్రమతో ఎక్కువగా లాభాలు పొందే విధానాన్ని అలవర్చుకుంటూ ముందుకుపోతున్నారు. ఎక్కువగా మామిడి, బొప్పాయి, అరటి పంటలు సాగు చేసే రైతులు అంతర పంటలుగా వివిధ రకాల కూరగాయలు పంటలను ప్రకృతి విధానంలో సాగుచేస్తూ.. పెట్టుబడి తగ్గించుకుంటూ.. అధిక లాభాలను పొందుతున్నారు. ఈ విధానాలనే పాటిస్తూ.. మన్యం జిల్లాకి చెందిన ఓ గిరిజన రైతు జీడిమామిడిలో అంతర పంటలు సాగుచేసి అదనపు ఆదాయం పొందుతున్నారు.

READ ALSO : Nara Brahmani : వైసీపీ అసమర్థ పాలన, నిజాన్ని కూడా చూడలేని కపోదులు : నారా బ్రాహ్మణి

జీడిమామిడి మొక్కల మధ్య అంతర పంటలు సాగుచేసిన ఈ క్షేత్రం పార్వతీపురం మన్యం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండలం, జేకే పాడులో ఉంది. ఇక్కడ అన్న జీడి, మామిడితోటలే సాగవుతుంటాయి. అయితే ఏడాదికి ఒక పంట మాత్రమే చేతికి వస్తుంది. తరువాత తోటలను వదిలేస్తుంటారు రైతులు . కానీ రైతు అగ్గయ్య మాత్రం తనకున్న 5 ఎకరాల జీడితోటలలో మొక్కల మధ్య దూరాన్ని ఉపయోగించుకొని  అంతర పంటలు సాగుచేస్తూ.. అదనపు ఆదాయం పొందుతున్నారు.

READ ALSO : New Sun : సూర్యుడి లాంటి కొత్త నక్షత్రం.. భూమికి వెయ్యి కాంతి సంవత్సరాల దూరంలో బేబి సూర్యుడు

దీర్ఘకాలిక పంటలను వేస్తున్నా, అందులో కూడా అంతర పంటలను వేసి ఏమాత్రం భూమిని, సమయాన్ని వృథా చేయకుండా రాబడి పొందుతున్నా రైతు అగ్గన్న సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు