Nara Brahmani : వైసీపీ అసమర్థ పాలన, నిజాన్ని కూడా చూడలేని కపోదులు : నారా బ్రాహ్మణి

వైసీపీకి వ్యాపార సూత్రాలు బోధిస్తూ సిమెన్స్ మాజీ ఎండీ అన్ని అనుమానాలు నివృత్తి చేశారని తెలిపారు. ఉపాధి అవకాశాలు కాపాడేందుకు ప్రతీ ఒక్కరూ చంద్రబాబు వెంటే ఉంటున్నారని పేర్కొన్నారు.

Nara Brahmani : వైసీపీ అసమర్థ పాలన, నిజాన్ని కూడా చూడలేని కపోదులు : నారా బ్రాహ్మణి

Nara Brahmani

Updated On : September 18, 2023 / 9:21 AM IST

Nara Brahmani Fire YCP : వైసీపీపై నారా బ్రాహ్మణి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. బ్యూరోక్రసీ, ప్రభుత్వ సంస్థలు, బహుళజాతి సంస్థలు, యువత ప్రజాస్వామ్యాన్ని జోక్ చేయటం వైసీపీ నేతలకు తగదని నారా బ్రాహ్మణి హితవు పలికారు. వైసీపీ నాయకులు పాలనలో అసమర్థులు మాత్రమే కాదు, నిజాన్ని కూడా చూడలేని కపోదులు అని మండిపడ్డారు.

వైసీపీకి వ్యాపార సూత్రాలు బోధిస్తూ సిమెన్స్ మాజీ ఎండీ అన్ని అనుమానాలు నివృత్తి చేశారని తెలిపారు. ఉపాధి అవకాశాలు కాపాడేందుకు ప్రతీ ఒక్కరూ చంద్రబాబు వెంటే ఉంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. చంద్రబాబు అరెస్టును టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

Nara Brahmani: చంద్రబాబు త్వరలోనే బయటకు వచ్చి..: నారా బ్రాహ్మణి

వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరోవైపు చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నారా బ్రాహ్మణి నిరసన గళం వినిపించారు. చంద్రబాబును అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.

ఈ మేరకు బ్రాహ్మణి ప్రత్యక్షంగా ఆందోళన, పోరాటాల్లో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పలు నిరసన కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఆదివారం రాజమండ్రిలో చేపట్టిన కాగడాల ప్రదర్శనలో భువనేశ్వరి, బ్రాహ్మణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడిన మాటలు ఆ పార్టీ నేతల మనుసులను కదిలింపజేశాయి.