Soil Testing : భూసార పరీక్షలతో తగ్గనున్న.. పంట పెట్టుబడులు

భూమిలో లభ్యమయ్యే భాస్వరం, పొటాష్ ల శాతం ఎక్కువగా వున్నప్పటికీ,  రైతులు రసాయన ఎరువుల రూపంలో విచక్షణారహితంగా వాడటంవల్ల, పెట్టుబడులు పెరగటంతో పాటు సాగులో సమస్యలు ఎక్కువై, రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

Soil Testing : పంటల్లో, దిగుబడి అనేది  నేల సారం, సాగుచేసే రకం, యాజమాన్యాన్నిబట్టి ఆధారపడి వుంటుంది. దీంట్లో కీలక భూమికను పోషించేది భూసారం.  నేలలో సహజసిద్ధంగా లభ్యమయ్యే అనేక పోషకాలు అందుబాటులో వుంటాయి. వీటి స్థితి గతులను అంచనా వేయకుండా… పదేపదే రసాయన ఎరువులను విచ్చలవిడిగా వాడటంవల్ల సాగు ఖర్చు పెరిగిపోవటమేకాక, భూ భౌతిక లక్షణాలు కూడా దెబ్బతినే ముప్పు ఏర్పడింది. కాబట్టి ప్రతి రైతు ఈ వేసవిలో నేల ఆరోగ్యాన్ని సంరంక్షించే విధంగా భూసార పరీక్షలు చేపట్టాలి.

READ ALSO : Mixed Farming : చేపలు, కోళ్లు, పశువులతో.. మిశ్రమ వ్యవసాయం చేస్తున్న రైతు

మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలోను మండలాలవారీగా భూసార పరీక్షా కేంద్రాలు అందుబాటులో వున్నాయి. పంటలు లేకుండా భూములు ఖాళీగా వున్న ఈ సమయంలో రైతులు మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి.

READ ALSO : Mechanization in Paddy : వ్యవసాయంలో కూలీల కొరత.. అధిగమించేందుకు యాంత్రీకరణ

భూమిలో లభ్యమయ్యే భాస్వరం, పొటాష్ ల శాతం ఎక్కువగా వున్నప్పటికీ,  రైతులు రసాయన ఎరువుల రూపంలో విచక్షణారహితంగా వాడటంవల్ల, పెట్టుబడులు పెరగటంతో పాటు సాగులో సమస్యలు ఎక్కువై, రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనికి చక్కటి పరిష్కారం భూసార పరీక్షలంటూ.. మట్టి నమూనా సేకరించే విధానాన్ని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన శాస్త్రవేత్త విజయ్.

ట్రెండింగ్ వార్తలు