Mechanization in Paddy : వ్యవసాయంలో కూలీల కొరత.. అధిగమించేందుకు యాంత్రీకరణ

ప్రస్థుతం ఎకరం పొలంలో  వరికోత కోసి నూర్పిడి చేయాలంటే 6వేలకు పైగా ఖర్చవుతోంది. ఇది రైతుకు మరింత భారంగా మారింది. ఈ నేపధ్యంలో కొత నూర్పిడి యంత్రాలు రైతుకు మంచి చేయూతగా నిలుస్తున్నాయి. వరిసాగుకు సంబంధించి అనేక యాంత్రాలు ఉన్నా, ఎక్కువగా కోతకోయడం, నూర్పిడి చేయడం, గడ్డిని కట్టలు కట్టే యంత్రాలను అధికంగా వాడుతున్నారు.

Mechanization in Paddy : వ్యవసాయంలో కూలీల కొరత.. అధిగమించేందుకు యాంత్రీకరణ

Mechanization in Rice

Mechanization in Paddy : వ్యవసాయంలో కూలీల కొరత అధిగమించి అధిక దిగుబడి సాధించాలంటే ఆధునిక వ్యవసాయ పరికరాలు వాడాల్సిందే. వీటి ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి వీలవుతుంది. ప్రస్తుతం వరిసాగులో అనేక ఆధునిక యంత్రాలు అందుబాటులో వున్నాయి. వీటిలో కోత, నూర్పిడి యంత్రాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

READ ALSO : Prevention Of Pests : వరిలో చీడపీడల నివారణ, రైతులకు శాస్త్రవేత్తల సూచనలు !

తెలుగు రాష్ట్రాల్లో  ముఖ్యమైన ఆహార పంట వరి . గ్రామీణులకు ఉపాధినందించే పంటలలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది.  వరి సాగు విస్తీర్ణం, దిగుబడి తగ్గినా దాని ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థమీద పడటమే కాకుండా, ఆహార భద్రతపై పెను ప్రభావం చూపునుంది. 60% గ్రామీణ ప్రజలు వరిసాగుపై  ఆధారపడి జీవిస్తున్నారు. మారుతున్న పరిస్థితుల అనుగుణంగా యువత జీవనోపాధి కొరకు పట్టణాలకు వలస వెళ్ళటం , ప్రభుత్వ పథకాల వలన గ్రామీణ ప్రాంతాలలో కూలీల కొరత ఏర్పడింది.

ప్రస్థుతం ఎకరం పొలంలో  వరికోత కోసి నూర్పిడి చేయాలంటే 6వేలకు పైగా ఖర్చవుతోంది. ఇది రైతుకు మరింత భారంగా మారింది. ఈ నేపధ్యంలో కొత నూర్పిడి యంత్రాలు రైతుకు మంచి చేయూతగా నిలుస్తున్నాయి. వరిసాగుకు సంబంధించి అనేక యాంత్రాలు ఉన్నా, ఎక్కువగా కోతకోయడం, నూర్పిడి చేయడం, గడ్డిని కట్టలు కట్టే యంత్రాలను అధికంగా వాడుతున్నారు. వరిని కోసే యంత్రాన్నిపాడీ రీపర్ అంటారు.  ఈ కోత యంత్రాన్ని పొలం చుట్టూ వృత్తాకారంలో తిప్పుతూ కోయాలి. దీని వల్ల పనలు వరుసక్రమంలో పడతాయి.

READ ALSO : Paddy Cultivation : వరిలో కాండంతొలుచు పురుగు, సుడిదోమ ఉధృతి… నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు

ఈ యంత్రానికి కింద అమర్చిన త్రికోణాకారపు బ్లేడులు పంటను కోస్తాయి. కోసిన పంటను యంత్రం ముందు బాగాన గల బెల్టులు యంత్రానికి ఒకవైపు వరుసల్లో వేస్తాయి. ఇది 5 హెచ్.పి స్వామర్థ్యం గల డీజిల్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఈ యంత్రాన్ని ఒక మనిషి సులువుగా 2 గంటల్లో ఎకరం పొలాన్ని కోయవచ్చు. దీని ధర రూ. 90 వేల నుండి 1 లక్ష 10 వేల వరకు ఉంటుంది. ప్రభుత్వం 50 శాతం రాయితీ అందిస్తోంది.

కోత నూర్పిడి ఒకేసారి చేసే యంత్రాల్లో కంబైన్ హార్వెస్టరు ప్రముఖ పాత్ర పోషిస్తోంది.   పొలం పరిస్థితిని బట్టి ఒక ఎకరం పొలాన్ని 1 గంట నుండి 1.30 నిమిషాల్లో కోసి, నూర్పిడి చేసి ధాన్యాన్ని శుభ్రం చేస్తుంది. ఈ యంత్రాన్ని వరికోతకు ఉపయోగించుటం  వలన సుమారు రూ.3,400  ఖర్చును తగ్గించ్చుకోవచ్చు. అయితే దీని వాడకం వల్ల వరిగడ్డి ముక్కలు ముక్కలుగా కత్తిరించి పొలమంతా వెదజల్లటం వల్ల, గడ్డి వృధాగా పోతోంది. మళ్లీ గడ్డిని కట్టలు కట్టాలంటే  బేలర్ యంత్రాన్ని ఉపయోగించాల్సిన  పరిస్థితి వస్తోంది.

READ ALSO : Areca nut Cultivation : ఒక్కసారి నాటితే 20 ఏళ్ల వరకు దిగుబడి.. వక్కసాగుతో లాభాలు పక్కా

ప్రస్థుతం ఎకరం వరిగడ్డి 10 వేలు పలుకుతోంది.  ఈ యంత్రం ఒక లీటరు డీజిల్ తో గంటలో ఒక ఎకరం వరినికోసి, నూర్చటమే కాక, గడ్డిని  కట్టలుగా కట్టటం వల్ల రైతుకు అదనపు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్నాయి.