Areca nut Cultivation : ఒక్కసారి నాటితే 20 ఏళ్ల వరకు దిగుబడి.. వక్కసాగుతో లాభాలు పక్కా

కర్ణాటక నుంచి ఒక్కొ మొక్కకు 50 రూపాయల చొప్పున వెచ్చించి కొనుగోలు చేశారు. సాధారణంగా ఎకరాకు 500 మొక్కలను వేస్తారు. అయితే.. తనకు కొత్త పంట కావడంతో..  ఎకరానికి 150 నుంచి 200 మొక్కలను నాటారు.  దిగుబడి బాగా వస్తే మరిన్ని మొక్కలను నాటనున్నారు. డ్రీప్‌ ద్వారా నీటి తడులను అందిస్తున్నారు.

Areca nut Cultivation : ఒక్కసారి నాటితే 20 ఏళ్ల వరకు దిగుబడి.. వక్కసాగుతో లాభాలు పక్కా

Areca nut Cultivation

Areca nut Cultivation : తమలపాకులు తాంబూలంగా మారాలంటే వక్క ఉండాల్సిందే. ఆ వక్కతో నోటినే కాదు జీవితాలనూ పండించుకోవచ్చు. వక్కతోటకు చీడపీడలు, పెట్టుబడులు, కూలీల సమస్యలు తక్కువగా ఉంటుంది. అధికంగా కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పండించే ఈ పంట ప్రస్తుతం ఏపీలో విస్తరిస్తోంది. ఇటు మార్కెట్‌లోనూ, మంచి ధర పలుకుతుండటంతో, చాలా మంది రైతులు వక్క సాగు వైపు మొగ్గు చూపుతున్నారు.

READ ALSO : Intercrop Cultivation : పామాయిల్ లో అంతర పంటగా చెరకు సాగు

ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లాకు ఓ రైతు.. వక్కసాగు చేస్తున్నారు. ప్రస్తుతం పంట పూత దశలో ఉంది. మరి కొద్ది రోజుల్లో పంట దిగుబడి ప్రారంభమై, మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు మండలం, ద్వారాక తిరుమల గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణకి చెందిన వక్కతోటలో గతంలో జీడిమామిడి పండించేవారు. అయితే లాభాలు పెద్దగా రాకపోవడంతో వక్క సాగు చేపట్టారు.

కర్ణాటక నుంచి ఒక్కొ మొక్కకు 50 రూపాయల చొప్పున వెచ్చించి కొనుగోలు చేశారు. సాధారణంగా ఎకరాకు 500 మొక్కలను వేస్తారు. అయితే.. తనకు కొత్త పంట కావడంతో..  ఎకరానికి 150 నుంచి 200 మొక్కలను నాటారు.  దిగుబడి బాగా వస్తే మరిన్ని మొక్కలను నాటనున్నారు. డ్రీప్‌ ద్వారా నీటి తడులను అందిస్తున్నారు.

READ ALSO : Rugose white : కొబ్బరి, పామాయిల్‌ తోటల్లో రూగోస్‌ తెల్లదోమ నివారణ

సాధారణంగా మొక్క నాటిన ఐదేళ్ల తర్వాత గానీ పంట చేతికి రాదు. ఐదేళ్ల తర్వాత నుంచి ఏటా ఒక పంట చేతికొస్తుంది. ప్రస్తుతం వక్క పూత, గింజకట్టే దశలో ఉంది. ఒక్కో చెట్టు నుంచి గరిష్టంగా 100 కేజీల వరకూ పచ్చి వక్క కాయలు వచ్చే అవకాశం ఉందని రైతు చెబుతున్నారు. దిగుబడి బాగుంటే.. సాగు విస్తీర్ణం పెంచే ఆలోచనలో ఉన్నారు.

READ ALSO : Benefits Of Mulching : వ్యవసాయ సాగులో మల్చింగ్ ప్రాధాన్యత, కలిగే లాభాలు

సాధారణంగా పచ్చి గెలలను కోసిన తర్వాత, వాటి నుంచి వక్కను వేరు చేస్తారు. వక్క వలిచే యంత్రాల సహకారంతో చిప్పను, వక్క ఉండలను వేరు చేస్తారు. అనంతరం వాటిని నీళ్లలో ఉడకబెట్టి.. 8 రోజుల పాటు ఎండకు ఆరబెట్టి సంచుల్లో నింపి నిల్వ చేస్తారు. మార్కెట్లో మంచి ధర ఉన్నప్పుడు అమ్మకాలు చేస్తారు. మార్కెటింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకపోవటంతో వక్కసాగు బాగుందని రైతులు అంటున్నారు.