Orange Farming | Lemon Farming
Orange – Lemon Farming : తెలుగు రాష్ట్రాల్లో మూడున్న లక్షల ఎకరాల్లో చీని , నిమ్మతోటలు సాగవుతున్నాయి. ఈ మధ్య కాలంలో చీడపీడల బెడద ఎక్కువ అవుతుంది. ముప్పై ఏళ్ల పాటు దిగుబడులు ఇవ్వాల్సిన తోటలు.. 10, 15 ఏళ్లకు మించి నిలబడటం లేదు. వీటిలో కాయ నాణ్యతను, దిగుబడిని తగ్గించేవి కొన్ని అయితే చెట్లను నిలువునా ఎండిపోయేల చేసే ప్రమాదకర తెగుళ్లు మరికొన్ని. వీటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్.
మన దేశంలో పండ్ల తోటల సాగులో మామిడి, అరటి తరువాత బత్తాయి , నిమ్మ పంటలు మూడవ స్థానాన్ని ఆక్రమిస్తోంది . తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో బత్తాయి విస్థీర్ణంలో నల్గొండ జిల్లా అగ్రస్థానంలో ఉంది. ప్రస్థుతం వేసవి పంటను తీసుకున్న రైతు తోటలకు విశ్రాంతినివ్వగా, శీతాకాలపు పంట తీసుకునే తోటల్లో కాయ, పిందె దశలో వుంది.
Read Also : Mango Farming Cultivation : మామిడి తోటల్లో పూత పురుగును అరికట్టే విధానం
అయితే కొన్ని మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా తోటల్లో పురుగులు, తెగుళ్ల ఉధృతి పెరిగింది. వీటిని సకాలంలో అరికడితేనే నాణ్యమైన దిగుబడులు పొందేందుకు ఆస్కారం ఉంటుంది. లేదంటే ఏడాది పంట నష్టపోవడమే కాకుండా పెట్టుబడులు సైతం చేతికి రావు. ప్రస్తుతం చీనీ, బత్తాయి తోటలకు ఆశించిన పురగులు, తెగుళ్లు వాటి నివారణ గురించి రైతులకు తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్.
బత్తాయి, నిమ్మకు ఆశించే పురుగులు :
ఆకుముడత పురుగు
నల్లిపురుగు
గొంగళిపురుగు
పేనుబంక , నల్లి
బత్తాయి, నిమ్మకు ఆశించే తెగుళ్లు
బంక తెగులు
వేరుకుళ్లు తెగులు
గజ్జి తెగులు
ఆకుముడత పురుగు నివారణ
ప్రొపినోఫాస్ 2 మి. లీ.
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
ఆకుముడత పురుగు నివారణ
ఇమిడాక్లోప్రిడ్ 1.5 మి. లీ.
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
ఆకుముడత పురుగు నివారణ
థయోమిథాక్సామ్ 1.5 మి. లీ.
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
గొంగలి పురుగు నివారణ
నొవాల్యూరాన్ + ఇమామెక్టిమ్ బెంజోయేట్ 2 మి.లీ.
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
నల్లిపురుగు నివారణ
నీటిలో కరిగే గంధకం 3 గ్రా.
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
నల్లిపురుగు నివారణ
ప్రోపరోగేట్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
పిండినల్లి నివారణ
ఎసిఫేట్ + ప్రొపినోపాస్ 2 మి.లీ.
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
పిండినల్లి నివారణ
కార్బెండిజమ్ 1 గ్రా.
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
గజ్జితెగులు నివారణ
కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రా.
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
గజ్జితెగులు నివారణ
స్ట్రేప్టోసైక్లిన్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
వేరుకుళ్లు తెగులు నివారణ
ట్రరైకోడెర్మి విరిడి కల్చర్ వేరు మొదల్లో వేయాలి
బంక తెగులు నివారణ
కాపర్ ఆక్సీ క్లోరైడ్ బోర్డాక్స్ మిశ్రమం పిచికారి చేయాలి
Read Also : Pest Management in Groundnut : వేరుశనగ పంటలో చీడపీడల ఉదృతి.. సమగ్ర సస్యరక్షణ