Mango Farming Cultivation : మామిడి తోటల్లో పూత పురుగును అరికట్టే విధానం

Mango Farming Cultivation : మామిడికి ఈ సంవత్సరం కొత్త సమస్య ఎదురైంది. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో మామిడి పూత దశలో ఉంది. ఇప్పుడిప్పుడే పూత గెలలు బయటకు వస్తున్నాయి.

Mango Farming Cultivation : మామిడి తోటల్లో పూత పురుగును అరికట్టే విధానం

mango farming cultivation and techniques in telugu

Mango Farming Cultivation : ఈ ఏడాది మామిడి తోటలకు పూత పురుగు గండం ఏర్పడింది. అరుదుగా కనిపించే ఈ పురుగు,  ఈ ఏడాది ఉధృతంగా ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. పూత దశలో పూరెమ్మలను తొలిచేసి తీవ్రంగా నష్టపరుస్తోంది.

పూరెమ్మలు మాడిపోవటం అర్థంకాని రైతులు, వాతావరణ మార్పులు వల్ల నష్టం జరుగుతుందనే ఆందోళనలో వున్నారు. పూరెమ్మలను జాగ్రత్తగా గమనించి, పురుగును గుర్తించిన వెంటనే రైతులు నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్  డా. ఎ. వెంకటరెడ్డి.

Read Also : Marrigold Cultvation : బంతి సాగుతో అధిక లాభాలు పొందుతున్న రైతు

మామిడికి ఈ సంవత్సరం కొత్త సమస్య ఎదురైంది. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో మామిడి పూత దశలో ఉంది. ఇప్పుడిప్పుడే పూత గెలలు బయటకు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు అరుదుగా కనబడే పూరెమ్మలను తొలిచే పురుగు, ఈ ఏడాది ఉధృతంగా ఆశించి నష్టపరుస్తోంది.

దీని పట్ల అజాగ్రత వహించినట్లైతే ఈ ఏడాది పంట దిగుబడులు పూర్తిగా తగ్గే ప్రమాదం కనబడుతోంది. రైతులు ఈ పురుగుల ఉదృతిని గమనించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని తెలియజేస్తున్నారు వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్  డా. ఎ. వెంకటరెడ్డి.

పూరెమ్మలు తొలిచే పురుగు నివారణ

లీటరు నీటికి మోనోక్రోటోపాస్ 1. 6 మి. లీ లేదా

ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా పాస్పామిడిన్ 2 మి. లీ

పురుగు ఉదృతి అధికంగా ఉంటే లీటరు నీటికి డైక్లోరోవాస్ 1 మి. లీ.

Read Also : Intercropping in Cabbage : క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పంటల్లో అంతరపంటల సాగు