Intercropping in Cabbage : క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పంటల్లో అంతరపంటల సాగు

Intercropping in Cabbage : మారుతున్న కాలానికి అనుగుణంగా తక్కువ నీటి వినియోగం.. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు సాగు చేసి లాభాలు గడిస్తున్నాడు పార్వతీపురం మన్యం జిల్లా, గరుగుబిల్లికి చెందిన రైతు పాతిన లక్షణరావు.

Intercropping in Cabbage : క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పంటల్లో అంతరపంటల సాగు

Intercropping in Cabbage

Intercropping in Cabbage : మామిడి, జీడి తోటలకు పేరుగాంచిన పార్వతీపురం మన్యం జిల్లా ఇప్పుడు తీరొక్క పంటలకు కేరాఫ్‌గా నిలుస్తున్నది. ఇన్నాళ్లూ పండ్లతోటల సాగుకే మొగ్గు చూపిన ఇక్కడి రైతాంగం, ఇటీవలి కాలంలో కూరగాయల సాగువైపు మళ్లారు. తక్కువ సమయంలో పంట చేతికొచ్చి.. మార్కెట్ లో డిమాండ్ ఉన్న కూరగాయలను పండిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు.

Read Also : Tobacco Leaves Cultivation : లాభదాయకంగా మారిన పొగాకు సాగు

అంతర పంటలుగా ముల్లంగి, కొత్తిమీర సాగు :
మారుతున్న కాలానికి అనుగుణంగా తక్కువ నీటి వినియోగం.. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు సాగు చేసి లాభాలు గడిస్తున్నాడు పార్వతీపురం మన్యం జిల్లా, గరుగుబిల్లికి చెందిన రైతు పాతిన లక్షణరావు. ఎకరం భూమిలో ప్రయోగాత్మకంగా క్యాబేజీ, క్యాలీఫ్లవర్ సాగుచేస్తున్నారు.

అంతర పంటలుగా కొత్తిమీర, ముల్లంగి సాగుచేస్తున్నారు . ఇలా చేయడం వల్ల ఒక పంటకు వచ్చిన తెగుళ్లు మరో పంటకు రాదని రైతు చెబుతున్నారు. అతి తక్కువ సమయంలో వచ్చే కొత్తిమీర పై వచ్చే ఆదాయం ప్రధాన పంట అయిన క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పంటలకు పెట్టుబడి అవుతుంది.

ప్రధాన పంటలనుండి వచ్చే ఆదాయం మొత్తం లాభమేనంటున్నారు. ఈ ప్రాంతంలో శీతాకాలంలో మాత్రమే ఈ కూరగాయల సాగు జరుగుతుందని రైతులు చెబుతున్నారు. వేసవిలో అధిక ఉష్టోగ్రతల వలన సాగు కష్టమని, ప్రభుత్వం తమకి సౌకర్యాలు కల్పిస్తే వేసవిలో కూడా సాగు చేసేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

Read Also : Azolla Cultivation Methods : అజోల్లా పెంపకం.. సాగుతో తగ్గనున్న పశుగ్రాసం ఖర్చు