Cultivation Methods Of Taiwan Guava
Taiwan Guava : మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు.. ఆదాయానిచ్చే పంటలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. పంటవెనక పంట దిగుబడి పొందాలనే ఉద్దేశ్యంతో అంతర పంటలను సాగుచేస్తున్నారు. ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లా చెందిన ఓ రైతు.. జామలో పుచ్చు, బూడిద గుమ్మడిని సాగుచేస్తున్నారు. వచ్చిన దిగుబడిని ఓరిస్సా, చెన్నై రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ.. మంచి ఆదాయం పొందుతున్నారు.
READ ALSO : Guava : జామతోటల్లో చీడపీడలు నివారణ
పశ్చిమగోదావరి జిల్లా, నల్లజర మండలం, పోతవరం గ్రామానికి చెందిన రైతు చంద్రశేఖర్ తనకున్న5 ఎకరాల్లో, ఏడాదికి క్రితం పుచ్చ సాగులో అంతర పంటగా తైవాన్ రెడ్ లేడి జామ మొక్కలను నాటారు. ఎకరానికి 800 చొప్పున మొక్కల నాటారు. మొక్క నాటిన 6 నెలలకే దిగుబడి ప్రారంభమైంది. వచ్చిన దిగుబడిని కిలో 10 రూపాలయ చొప్పన బాక్సులు రూపంలో ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్నారు.
READ ALSO : Guava Cultivation : జామ సాగులో సస్యరక్షణ , తెగుళ్ళు..
రైతు చంద్రశేఖర్ సెమిఆర్గానిక్ పద్ధతిలో పంట సాగుచేస్తున్నారు. అధికంగా సేంద్రియ ఎరువులే వాడినా.. 20 శాతం మాత్రం రసాయన ఎరువులు వేస్తుననారు. దీంతో మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. అందుకే ఎప్పటికప్పుడు కొమ్మకత్తిరింపులు చేస్తుండటంతో.. దిగుబడి కూడా పెరుగుతోంది.