Guava : జామతోటల్లో చీడపీడలు నివారణ

తెల్లదోమ ఆకుల అడుగు భాగాన వలయాకారంలో గ్రుడ్లను పెడతాయి. తెల్లదోమ ఆకుల పై తెల్లని దూది వంటి మెత్తని పదార్ధంతో కప్పబడి రసాన్ని పీలుస్తాయి.

Guava : జామతోటల్లో చీడపీడలు నివారణ

Guva Cultivation

Guava : పండ్ల తోటల్లో జామ ఒకటి. మంచి పోషక విలువలతో ఉండి మార్కెట్లో చౌకగా దొరికే ఈ జామను పేదవాడి యాపిల్ పండుగా చెప్తారు. ఇటీవలికాలంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలసాగువైపు దృష్టిసారించిన నేపధ్యంలో జామసాగుకు మొగ్గు చూపుతున్నారు. సరైన సస్యరక్షణ చర్యలు పాటిస్తూ జామ సాగు చేపడితే నాణ్యమైన పంటను పొందటంతోపాటు, మంచి ధరను పొందవచ్చు. ముఖ్యంగా జామలో కాయతొలుచు పురుగులు, పేనుబంక, పిండినల్లి, పండు ఈగ, టీ దోమ , పొలుసు పురుగు, కాండం తొలుచు పురుగు వివిధ దశల్లో ఆశించి తీవ్రంగా నష్టం పరుస్తుంది.

జామలో చీడపీడలు నివారణ ;

పిండి నల్లి: తల్లి, పిల్ల పురుగులు అండాకారంలో ఉండి గులాబీరంగు శరీరాన్నికలిగి, దూది వంటి మెత్తని పదార్ధంతో కప్పబడి ఉంటాయి. ఇవి గుంపులుగా ఆకుల అడుగు భాగంలో చేరి, కొమ్మల పైన, పండ్లనుఆశించి రసాన్ని పీల్చి నష్టం కలుగచేస్తాయి. ఎకరానికి ఎక్కువ చెట్లను వేయడం వల్ల, నీరు ఇంకని భూముల్లో తోటలను వేయడం వల్ల, గాలిలో తేమ శాతం పెరిగి పిండినల్లి వృద్ధి చెందుతుంది. పిండినల్లి ఉధృతి అధికంగా ఉన్నప్పుడు పండ్లు చెట్ల నుండి రాలి కింద పడతాయి. ఈ పురుగులు తేనె లాంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వల్ల మసితెగులు వృద్ధి చెంది చెట్ల కాపు కూడా తగ్గుతుంది. దీని నివారణకు అల్లిక రెక్కల పురుగు, అక్షింతల పురుగు , అనే బదనికలను తోటల్లో విడుదల చేసి నివారించ వచ్చు. ఇవి మిత్ర పురుగులు. ఉదృతి అధికంగా ఉన్నప్పుడు వురుగు ఆశించిన కొమ్మలను కత్తిరించి తోటల నుండి దూరంగా తీనుకొని వెళ్లి నాశనం చేయాలి. ఈ పిండినల్లి ఉనికిని ఒకటి లేదా రెండు మొక్కల్లో గమనించగానే ఎసిఫేట్‌ 1.5 గ్రా. లేదా దైక్లోరోవాస్‌ 1 మి.లీ. నీటిలో కలిపి పురుగు ఆశించిన చెట్లకు, పక్కన ఉన్న చెట్లకు పిచికారి చేయాలి. చెట్ల మొదళ్ళలో వేపపిండి 15 కిలోలు చొవ్పున వేనుకొని నీటితడులు ఇవ్వాలి.

పొలుసు పురుగు : ఈ పురుగు అండాకారంగా ఉండి అకులపై లేత కొమ్మలపై, పండ్లను ఆశించి రసం పీల్చి నష్టపరుస్తాయి. పిల్ల వురుగులు గుడ్ల నుండి బయటకు వచ్చి అనువైన ప్రదేశంలో స్థిరపడి మైనం పొరను ఏర్పరచుకొని రసాన్ని పీల్చి నష్టపరుస్తాయి. జీవిత చక్రమంతా అక్కడే గడుపుతాయి. పురుగు ఉధృతి అధికంగా ఉంటే కాయ నాణ్యత తగ్గుతుంది. దీని నివారణకు పురుగు ఆశించిన కొమ్మలను కత్తిరించి కాల్చివేయాలి. చెట్ల మొదళ్ళలో వేప పిండి 15 కిలోల చొప్పున వేసుకొని తడి ఇవ్వాలి. 5శాతం వేపగింజల కషాయం లేదా 5 మి.లీ వేపనూనె లీటరు నీటికి కలిపి చెట్లు తడిచేలా పిచికారి చేయాలి. ఉధృతి అధికంగా ఉంటే డైక్లోరోవాస్ 1మి.లీ లీటరు నీటికి లేదా ఎసిఫెటో 1.6 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తేయాకు దోమ ; టీ దోమ జామతోటలో ఆశించి రసం పీల్చి పండ్ల నాణ్యతను కలోపోయేలా చేస్తుంది. పిల్ల పురుగులు, తల్లి పురుగులు జామ పిందెలను, పూ మొగ్గలను , చిగుర్లను ఆశించి రంధ్రాలు చేసి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల జామ పిందెలపై , కాయలపై బుడిపెలు ఏర్పడి పాడై పోతాయి. చిగుర్ల , కొమ్మల పై సన్నని పొడుగాటి నల్లని మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకు పురుగులు ఆశించిన కాయలను తొలగించి నాశనం చేయాలి. పసుపు రంగు జిగురు అట్టలను ఎకరానికి 50 చొప్పున ఏర్పాటు చేసుకోవాలి. టెలినోమస్ గుడ్లు పరాన్న జీవి కార్డులను చెట్లకు తగిలించి బవేరియా బాసియాను 5గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పూత , చిగురు దశల్లోనే 5శాతం వేపగింజల కషాయం లేదా వేపనూనె 5మీ.లీ, లేదా మలాథియాన్ 2మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తెల్లసుడి దోమ : తెల్లదోమ ఆకుల అడుగు భాగాన వలయాకారంలో గ్రుడ్లను పెడతాయి. తెల్లదోమ ఆకుల పై తెల్లని దూది వంటి మెత్తని పదార్ధంతో కప్పబడి రసాన్ని పీలుస్తాయి. ఇవి ఆశించిన ఆకులు ఎర్రబడి రాలిపోతాయి. వీటి ఉధృతి తీవ్రంగానున్నప్పుడు కాయను కూడా ఆశించి నష్టపరుస్తాయి. ఇవి నవంబర్ నెలలో ముదురు ఆకులను ఆశించి ఏప్రిల్ నెలలో చిగురుటాకులకు చేరుతుంది. ఫిబ్రవరి నెలలో తీవ్రస్థాయిలో నష్టంచేస్తాయి. ఆకుల పై ఇవి విసర్జించిన తేనె వంటి జిగురు పదార్ధం పై మసి తెగులు ఆశిస్తుంది. ప్రథమ దశలో అయితే ఆశించిన కొమ్మలను కత్తిరించివేసి వేపనూనె 5 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారి చేసి వీటి తీవ్రతను తగ్గించవచ్చు. వీటి ఉధృతి ఎక్కువైనచో ఫాస్పోమిడాన్ లేక డైక్లోరోవాస్ లేక హెూస్టాథయాన్ 1 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

బెరడు తినేపురుగు : ఈ పురుగులు వివిధ రకాల చెట్లను ఆశించి నష్టం కలుగజేస్తాయి. ఈ పురుగు వదిలేసిన పండ్ల తోటలలో ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు గ్రుడ్లను బెరడులో పెడుతుంది. దానిలోనుంచి పిల్ల పురుగు బయటకు వచ్చి కాండంలోకి చొచ్చుకొని తింటుంది. పిల్ల పురుగులు పగలు బెరడులో తింటూ రాత్రి వేళలలో బయటకు వస్తాయి. ఈ పురుగు బయటకు కనబడకుండా మట్టిలో మరియు అవి విసర్జించిన పదార్దములో సిల్కుదారాల ద్వారా గూడు ఏర్పరచుకుంటాయి. పురుగు ఆశించిన కొమ్మలు ఎండిపోయి క్రమేపి చెట్లు క్షీణిస్తాయి. తోటను పరిశుభ్రంగా ఉంచుకోవడము. ఈ పురుగును గమనించిన వెంటనే గూళ్లను దులిపేసి, అవి దాగి ఉండే రంధ్రాలలో ఇంకుఫిల్లర్తో 5 మి.లీ. డైక్లోర్ వాస్ లేదా పెట్రోలు లేదా కిరోసిన్ పోసి బంకమట్టితో పూడ్చినచో పురుగులు లోపలే చనిపోతాయి.

పొలుసు పురుగులు ; పొలుసు పురుగులు అరుదుగా ఆశిస్తాయి. ఈ పురుగులు అండాకారంగా నుండి ఆకుల పై, లేత కొమ్మల పై మరియు పండ్లను ఆశించి రసం పీల్చి నష్టపరుస్తాయి. పిల్ల పురుగులు గ్రుడ్ల నుండి బయటకు వచ్చి అనువైన ప్రదేశంలో స్థిరపడి మైనము పొరను ఏర్పరచుకొని రసాన్ని పీల్చి నష్టపరుస్తాయి. జీవితచక్రమంతా అక్కడే గదుపుతాయి. ఇవి అధిక సంఖ్య లో ఆశించిన ఎడల కాయ నాణ్యత తగ్గుతుంది. వీటి నివారణకు పురుగులు ఆశించిన కొమ్మలను కత్తిరించి కాల్చివేయాలి. డైక్లోరోవాస్ 1 మి.లీ. లేదా ఎసి ఫేట్ 1 గ్రా లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.