Bengaluru: తెలుగు సీరియల్‌ నటికి అభ్యంతరకర వీడియోలు, సందేశాలు పంపించిన వ్యక్తి.. ఆ నటి ఏం చేసిందంటే? దెబ్బకు దిమ్మతిరిపోయింది..

Bengaluru నవంబర్ 1వ తేదీన పంపించిన మెస్సేజ్ లో తనను కలవాలి అంటూ ఆ వ్యక్తి పేర్కొన్నాడు. అతని తీరుపై నటి ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు..

Bengaluru: తెలుగు సీరియల్‌ నటికి అభ్యంతరకర వీడియోలు, సందేశాలు పంపించిన వ్యక్తి.. ఆ నటి ఏం చేసిందంటే? దెబ్బకు దిమ్మతిరిపోయింది..

Bengaluru

Updated On : November 4, 2025 / 1:26 PM IST

Bengaluru: బెంగళూరుకు చెందిన 41ఏళ్ల టీవీ నటి పోలీసులను ఆశ్రయించింది. ఓ వ్యక్తి తనకు పదేపదే సోషల్ మీడియా ద్వారా అశ్లీల సందేశాలు.. అసభ్యకర వీడియోలు పంపిస్తున్నాడని.. పలుసార్లు హెచ్చరించినా అతని తీరులో మార్పు రాలేదని పోలీసులకు అందజేసిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో లైంగిక వేధింపులు, సోషల్ మీడియా దుర్వినియోగంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నటికి అసభ్యకర వీడియోలు పంపిస్తున్న వ్యక్తిని గుర్తించారు. అతను నవీన్ కె మోన్‌గా నిర్ధారించి.. అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

తెలుగు, కన్నడ టీవీ సీరియల్స్‌లో పనిచేసే నటి రజనీకి ఫేస్‌బుక్‌లో ‘నవీంజ్’ అనే యూజర్ నుండి మూడు నెలల క్రితం ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. నటి ఆ రిక్వెస్ట్‌ను ఆమోదించింది. ఆ తరువాత కొద్దిరోజుల నుండి ఆ వ్యక్తి ప్రతిరోజూ మెసెంజర్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపించడం ప్రారంభించాడు. దీంతో అతని ఐడీని బ్లాక్ చేసింది. ఆ తరువాత ఆ వ్యక్తి.. కొత్త అకౌంట్ ను క్రియేట్ చేసి ఆమెను లైంగికంగా వేధిస్తూనే ఉన్నాడు. పలు ఐడీల ద్వారా అకౌంట్లను క్రియేట్ చేసి నటి రజనీకి అశ్లీల సందేశాలతోపాటు.. అతని ప్రైవేట్ పార్టుల వీడియోలు కూడా పంపాడని నటి పేర్కొంది.

Also Read: Gold Price Today : మహిళలకు శుభవార్త.. ఆ ఒక్క కారణంతో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

నవంబర్ 1వ తేదీన పంపించిన మెస్సేజ్ లో తనను కలవాలి అంటూ ఆ వ్యక్తి పేర్కొన్నాడు. అతని తీరుపై నటి ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు.. నీ ప్రవర్తన మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. అయినా, అతనికి ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో.. ఆమె పోలీసులను ఆశ్రయించింది.

నటి రజనీకి అసభ్యకర వీడియోలు, సందేశాలు పంపించేది నవీన్ కె మోన్ అని పోలీసులు గుర్తించారు. అతను బెంగళూరులోని గ్లోబల్ టెక్నాలజీ రిక్రూట్మెంట్ ఏజెన్సీలో డెలివరీ మేనేజర్ గా పనిచేశాడు. ఆ సంస్థకు లండన్, పారిస్, బెర్లిన్, జ్యూరిచ్, వార్సాతోపాటు న్యూయార్క్ లోనూ కార్యాలయాలు ఉన్నాయి.