Rabi Crops : వరికి ప్రత్యామ్నాయంగా యాసంగిలో ఆరుతడి పంటల సాగు

పంట మార్పిడి వలన పంటనాశించే పురుగులు, తెగుళ్లు తగ్గుతాయి. ఆరుతడి పంటలు వేయడం వల్ల నిత్యావసరాలైన పప్పులు, నూనెగింజల కొరత తగ్గుతుంది. అంతే కాదు పప్పుధాన్యపు పంటలతో పంట మార్పిడి చేయడం వలన  భూమి సారం వృద్ధి చెందుతుంది.

Rabi Crops

Rabi Crops : వరికి ప్రత్యామ్నాయంగా యాసంగిలో ఆరుతడి పంటల సాగు శ్రేయస్కరమంటున్నారు శాస్త్రవేత్తలు. నీటి తడుల లభ్యతను బట్టి  రైతులు పంటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. యాసంగిలో ఏఏ పంటలు వేసుకోవాలి.. ఎలాంటి రకాలను ఎంచుకోవాలి ? ఏ సమయంలో విత్తుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చో తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. తిరుపతి.

READ ALSO : Paddy Cultivation : వరిలో కాండంతోలుచు పురుగు, సుడిదోమ..నివారణకు ముందస్తుగా చేపట్టాల్సిన సస్యరక్షణ

ఖరీఫ్ పంటలు చివరి దశకు చేరుకున్నాయి. రైతులు రబీ పంటల సాగుకు సిద్దమతుంటారు. ఇందుకోసం ఇప్పటి నుండే విత్తన సేకరణ చేస్తుంటారు. అయితే గత కొన్నేళ్లుగా రబీలో కూడా బావులు, చెరువల కింద, తేలికభూముల్లో సైతం  వరిసాగుచేస్తున్నారు రైతులు. అయితే రబీలో వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగుచేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

READ ALSO : Mani Pandu Tegulu : వరిలో మానిపండు తెగులు ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

పంట మార్పిడి వలన పంటనాశించే పురుగులు, తెగుళ్లు తగ్గుతాయి. ఆరుతడి పంటలు వేయడం వల్ల నిత్యావసరాలైన పప్పులు, నూనెగింజల కొరత తగ్గుతుంది. అంతే కాదు పప్పుధాన్యపు పంటలతో పంట మార్పిడి చేయడం వలన  భూమి సారం వృద్ధి చెందుతుంది. అయితే ఏఏ నేలల్లో ఏఏ పంటలు .. ఎప్పుడు వేసుకోవాలో తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. తిరుపతి.

READ ALSO : Paddy Crop : వరిలో ప్రస్తుతం ఆశించిన చీడపీడల నివారణ

రబీ సీజన్‌లో నేలల స్వభావం బట్టి మూడు రకాలుగా విభజించి రైతులు పంటలను సాగు చేసుకోవాలి. వర్షాధారంపై ఆధారపడిన నేలలు, నీటి పారుదల కింద ఆరుతడి పంటలు సాగుకు అనువుగా ఉన్న నేలలు, నీటి పారుదల, బోరు బావుల కింద వరిని సాగు చేసేందుకు అనువుగా ఉన్న నేలలను బట్టి రైతులు సాగుకు సన్నద్ధం కావాలి. ముఖ్యంగా నూనెగింజల పంటలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్ననేపథ్యంలో నూనెగింజల పంటల సాగుచేసి మంచి ఆదాయం పొందవచ్చు.

READ ALSO : Rice Production : వరిలో అధిక దిగుబడుల పొందటానికి నిపుణుల సూచనలు !

యాసంగిలో ఉన్న నీటి వసతిని బట్టి, మార్కెట్ రేటు..  ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎన్నుకొవాలి. సరైన సమయంలో సాగుచేసి, మేలైన యాజమాన్య పద్ధతులను పాటించినట్లైతే.. భూసారం పెంపొందించుకోవడమే కాకుండా.. అధిక దిగుబడిని పొంది నికర ఆదాయం పొందవచ్చు.

ట్రెండింగ్ వార్తలు