cultivation of Rabi oilseed crops
Rabi Oilseed Crops : యాసంగి పంటల సాగు మొదలవుతుంది. సరైన ప్రణాళిక ద్వారా పంటలు, రకాల ఎంపిక, యాజమాన్య పద్ధతులను పాటించడం వల్ల, రైతులు దిగుబడిని పొందే వీలుంటుంది. ముఖ్యంగా నూనెగింజ పంటల సాగు విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు నూనెగింజల పంటలను రైతులు సాగుచేస్తున్నారు.
అందులో వేరుశనగ, ఆముదం, నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమ ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు అనువైన రకాలు, ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం గురించి రైతులకు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. తిరుపతి.
ప్రస్తుతం మార్కెట్లో వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం మనదేశంలో నూనెగింజల సాగు తక్కువగా ఉండటమే.. ప్రతి ఏటా రూ.70 వేల కోట్లు చెల్లించి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అందుకే చాలా మంది రైతులు నూనె గింజల సాగు దిశగా అడుగులు వేస్తున్నారు. నూనె గింజల సాగుకు రబీ అనుకూలంగా ఉంటుంది.
ముఖ్యంగా వేరుశనగ, ఆముదం, పొద్దుతిరుగుడు, కుసుమ , ఆవాలు, నువ్వుల పంటను ఒక్కో ప్రాంతంలో ఒక్కో పంట సాగవుతుంది. ఇప్పటికే కొన్నిచోట్ల పంటలు విత్తారు. మరికొన్ని పంటలకు ఇంకా సమయం ఉంది. అయితే నాణ్యమైన అధిక దిగుబడులు సాధించాలంటే రైతులు విత్తన ఎంపిక, ఎరువుల యాజమాన్యం, నీటియాజమాన్యం కీలకం. ఏసమయంలో ఎలాంటి మెళకులు పాటించాలో తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. తిరుపతి.
ఖరీఫ్‌లో నీటి వనరులు పెరగడం వల్ల రైతులు ఎక్కువగా వరివైపు మొగ్గుచూపుతున్నారు. కుసుమ, ఆవాలు , నువ్వులు వంటి నూనె పంటల సాగు తెలంగాణలో భారీగా తగ్గింది. ఉత్తరాదిలో ఆవాలు అధికంగా సాగు చేస్తూ, అక్కడి రైతులు అధిక లాభాలు పొందుతున్నారు. రాష్ట్రంలో అక్కడక్కడా సాగవుతున్న నూనె గింజల విస్తీర్ణంలో 72 శాతం వరకు చిన్న, సన్నకారు రైతులే సాగుచేస్తున్నారు. అదికూడా సారవంతం కానీ నేలల్లో, వర్షాధారంగా, పెట్టుబడి లేకుండా వ్యవసాయం చేస్తున్నారు. సరైన అవగాహన లేకపోవడం వల్ల దిగుబడి కూడా తగ్గిపోతున్నది.
Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..