Terrac Garden : మిద్దెపై కూరగాయలు, పండ్లు పెంపకం

గృహమే స్వర్గసీమ అంటున్నారు ఆధునిక కాలంలో పలువురు. అలా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉందంటూ ఆచరించి చూపించి.. ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రకృతి నుంచి వచ్చిన మానవుడు.. మొక్కల నడుమన ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.

Terrac Garden

Terrac Gardent : మహానగరాల్లో టెర్రస్ గార్డెన్ ఇప్పుడో ఫ్యాషన్. ప్రస్తుతం చాల ప్రాంతాల్లోని ప్రజలు మేడపై మొక్కల పెంపకానికి ఆసక్తి చూపుతున్నారు. కొందరు పూల మొక్కలు పెంచుతుంటే మరికొందరు వివిధ రకాల కూరగాయల మొక్కల్ని పెంచుకుంటున్నారు. ఇలా సిద్ధిపేటలో కొంత మంది ఇంటిపైనే ఎటువంటి రసాయనాలు వాడకుండా.. సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, పండ్లు, పూలు పెంచుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.

READ ALSO : Tomato Cultivation : టమోటా సాగులో తెగుళ్లు , నివారణ పద్దతులు !

కొవిడ్​ తర్వాత మనిషుల ఆలోచనల్లో చాలా మార్పులు వచ్చాయి. ప్రకృతికి దూరంగా వెళ్లిన మనిషి… తిరిగి అదేవైపు అడుగులు వేస్తున్నాడు. రసాయనాలు వాడని కూరగాయలు, ఆక్సిజన్​ అందించే మొక్కల పెంపకం సహా… టెర్రస్​ గార్డెన్​లు ఏర్పాటు చేసుకుంటున్నారు. యాంత్రిక జీవనంలో కాస్త వెసులుబాటు చేసుకుని మొక్కలను పెంచుతూ మనసు సాంత్వన పరచుకోవడమే కాకుండా.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నారు. ఈ కోవలోనే సిద్ధిపేటకు చెందిన కొందరు మిద్దెపైనే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ఆయుర్వేద మొక్కలను పెంచుకుంటూ.. ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.

READ ALSO : Woman Cheating : వితంతువుగా నటించి పదేళ్లుగా తండ్రి పెన్షన్ పొందుతున్న కూతురు

గృహమే స్వర్గసీమ అంటున్నారు ఆధునిక కాలంలో పలువురు. అలా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉందంటూ ఆచరించి చూపించి.. ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రకృతి నుంచి వచ్చిన మానవుడు.. మొక్కల నడుమన ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇలా ప్రకృతి ప్రేమికులు తమ గృహాలను వనాలుగా మార్చేసి.. తమ అభిరుచిని చాటుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు