Woman Cheating : వితంతువుగా నటించి పదేళ్లుగా తండ్రి పెన్షన్ పొందుతున్న కూతురు

పదేళ్లుగా తండ్రికి వచ్చే పింఛను కూతురు తీసుకుంటున్నారు. భర్తతో గొడవ జరగడంతో ఈ మోసాన్ని పోలీసులకు అతడు చెప్పారు. దీంతో పోలీసులు మహిళను అరెస్ట్ చేశారు.

Woman Cheating : వితంతువుగా నటించి పదేళ్లుగా తండ్రి పెన్షన్ పొందుతున్న కూతురు

Woman Cheating

Updated On : August 10, 2023 / 1:01 AM IST

Woman Cheating In Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ లో ఓ మహిళ ఘరానా మోసానికి పాల్పడ్డారు. కూతురు వితంతువుగా నటించి తండ్రి పెన్షన్ పొందుతున్నారు. ఆమె భర్త ఫిర్యాదుతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఎటా జిల్లాలో చోటు చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసి రిటైర్డ్ అయిన ఒక వ్యక్తి మరణించాడు. అయితే అతడి కూతురు వితంతువుగా నటించారు.

పదేళ్లుగా తండ్రికి వచ్చే పింఛను కూతురు తీసుకుంటున్నారు. భర్తతో గొడవ జరగడంతో ఈ మోసాన్ని పోలీసులకు అతడు చెప్పారు. దీంతో పోలీసులు మహిళను అరెస్ట్ చేశారు. అలీగంజ్ కు చెందిన విజరత్ ఉల్లా ఖాన్ సర్వేయర్ గా పని చేసి రిటైర్డ్ అయ్యారు. భార్య సవియా ముందుగానే చనిపోగా, 1987లో విజరత్ ఉల్లా ఖాన్ మరణించాడు.

Girl Assault : బీహార్ లో దారుణం.. బాలికను కిడ్నాప్ చేసి, 28 రోజులపాటు సామూహిక అత్యాచారం

అయితే, తండ్రి విజరత్ ఉల్లా ఖాన్ మరణం తర్వాత ఆయనకు వచ్చే పెన్షన్ డబ్బుల కోసం కుమార్తె మొహాసినా పర్వేజ్ మోసానికి పాల్పడ్డారు. మృతుడి భార్యగా నకిలీ పత్రాలు సృష్టించారు. గత పదేళ్లుగా ప్రభుత్వం నుంచి వచ్చిన తండ్రి పెన్షన్ సుమారు రూ.12 లక్షలు పొందారు. ఈ విషయం మొత్తం ఆమె భర్తకు కూడా తెలుసు.

మరోవైపు ఇటీవల మొహాసినా పర్వేజ్, ఆమె భర్త మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భార్య మోసం గురించి పోలీసులకు భర్త ఫిర్యాదు చేశారు. దీంతో మొహాసినాను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాల ద్వారా వితంతువుగా నమ్మించి పింఛను పొందుతున్న మోసంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.