Girl Assault : బీహార్ లో దారుణం.. బాలికను కిడ్నాప్ చేసి, 28 రోజులపాటు సామూహిక అత్యాచారం

13 ఏళ్ల బాలిక తల్లితో నివాసం ఉంటున్నారు. ఆ బాలికకు ఫేస్ బుక్ లో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో జులై9న ఆ యువకుడు సహా ఆరుగురు వ్యక్తులు బాలికను కిడ్నాప్ చేశారు.

Girl Assault : బీహార్ లో దారుణం.. బాలికను కిడ్నాప్ చేసి, 28 రోజులపాటు సామూహిక అత్యాచారం

Girl kidnap and Assault

Updated On : August 9, 2023 / 10:36 PM IST

Girl kidnapped And Gang Assault : బీహార్ లో దారుణం జరిగింది. బాలికను కిడ్నాప్ చేసి 28 రోజులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ముజఫర్ జిల్లాలో చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలిక తల్లితో నివాసం ఉంటున్నారు. ఆ బాలికకు ఫేస్ బుక్ లో  ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో జులై9న ఆ యువకుడు సహా ఆరుగురు వ్యక్తులు బాలికను కిడ్నాప్ చేశారు.

ఒక ఇంట్లో నిర్బంధించి బాలికపై 28 రోజులపాటు సామూహిక అత్యాచారం చేశారు. కాగా, కుమార్తె కనిపించకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ప్రేమ వ్యవహారంగా అనుమానించిన పోలీసులు దీని గురించి పట్టించుకోలేదు. ఆగస్టు5న బాలికను ముజఫర్ పూర్ లోని ఒకచోట వదిలేసినట్లు గుర్తు తెలియని వ్యక్తి బాలిక తల్లికి ఫోన్ కాల్ వచ్చింది.

Madhya Pradesh : ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం.. ఆపై వీడియో చిత్రీకరణ, బయటికి చెబితే చంపేస్తామని బెదిరింపులు

దీంతో స్థానికుల సహాయంతో బాలిక ఆచూకీ తెలుసుకుని ఇంటికి తీసుకెళ్లారు. ఫేస్ బుక్ లో పరిచయమైన వ్యక్తి తన స్నేహితులతో కలిసి తనను కిడ్నాప్ చేశారని, తనపై 28 రోజులపాటు సామూహిక అత్యాచారం చేశారని తెలిపారు. బాలిక తల్లి మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాదిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలిక స్టేట్ మెంట్ ను రికార్డు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.