Cultivation of Vegetables : కొబ్బరి తోటలో కూరగాయల సాగు.. అంతర పంటలతో అదనపు ఆదాయం

సాగులో పెట్టుబడి పెరగటం, ఆదాయం నామమాత్రంగా వుండటంతో,  ఏకపంటగా కొబ్బరిసాగు రైతుకు గిట్టుబాటు కావటం లేదు. ఈ దశలో చాలా మంది అంతర పంటలు సాగుచేసి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం, శివటం గ్రామానికి చెందిన రైతు లింగాల నాగేశ్వరరావు .

Coconut Plantation

Cultivation of Vegetables : ఏ పంట వేస్తే లాభాలు ఆర్జించవచ్చో, ఎప్పుడు వేస్తే మంచి దిగుబడిని పొందవచ్చో తెలిసిన వ్యక్తే ఆర్ధికంగా ఎదుగుతాడు. ఈ సూత్రం తెలిసిన తూర్పుగోదావరి జిల్లాకు చెండిన ఓ రైతు అంతర పంటల సాగుతో ప్రతి ఏడు మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం కొబ్బరిలో తీగజాతి కూరగాయలు సాగుచేస్తూ.. నాణ్యమైన అధిక దిగుబడులు పొందుతున్నారు.

READ ALSO : Ownership of Fertilizers : కొబ్బరి తోటల్లో చెపట్టాల్సిన ఎరువుల యాజమాన్యం

ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాలు కొబ్బరిసాగుకు పెట్టింది పేరు. అధిక వర్షపాతం, గాలిలో తేమశాతం అధికంగా వుండటంతో, కొబ్బరిసాగుకు అత్యంత అనువుగా వుంటుంది. అయితే సాగులో పెట్టుబడి పెరగటం, ఆదాయం నామమాత్రంగా వుండటంతో,  ఏకపంటగా కొబ్బరిసాగు రైతుకు గిట్టుబాటు కావటం లేదు. ఈ దశలో చాలా మంది అంతర పంటలు సాగుచేసి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం, శివటం గ్రామానికి చెందిన రైతు లింగాల నాగేశ్వరరావు .

READ ALSO : Paneer Health Benefits : రోజూ పనీర్ తినడం ఆరోగ్యానికి మంచిదా ?

కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తి ఈ అభ్యుదయ రైతుకు అక్షరాల సరిపోతుంది. వాణిజ్య పంటల దిగుబడి అందే సమయంలో మార్కెట్ లో గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రకృతి వైపరీత్యాల వంటి వాటితో తీవ్రంగా నష్టపోతున్న  రైతులను అంతర పంటలు ఆర్ఢికంగా ఆదుకుంటున్నాయి. అందుకే రైతు నాగేశ్వరరావు కొబ్బరిలో అంతర పంటలుగా కూరగాయలను సాగుచేస్తున్నారు.

READ ALSO : Intercropping : కొబ్బరి, కోకోలో అంతర పంటగా వక్కసాగు

ప్రస్తుతం తీగజాతి కూరగాయలైన చిక్కుడు, బీరను సాగుచేస్తున్నారు. చిక్కుడు దిగుబడి ప్రారంభం కాగా, బీర ఇప్పుడిప్పుడే పూత, పిందెదశలో ఉంది. వచ్చిన దిుగబడిని స్థానిక మార్కెట్ లో అమ్ముతూ… అదనపు ఆదాయం పొందుతున్నారు.