Paneer Health Benefits : రోజూ పనీర్ తినడం ఆరోగ్యానికి మంచిదా ?

పనీర్ లో జింక్ అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు అవసరమైన ఖనిజం. తెల్ల రక్త కణాల ఉత్పత్తిలో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇన్ఫెక్షన్లు , వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.

Paneer Health Benefits : రోజూ పనీర్ తినడం ఆరోగ్యానికి మంచిదా ?

paneer

Updated On : November 2, 2023 / 3:27 PM IST

Paneer Health Benefits : పనీర్,దీనినే చీజ్ అని కూడా పిలుస్తారు, ఇది భారతీయ వంటకాల్లో ఒక ప్రసిద్ధగాంచిందిగా చెప్పవచ్చు. పాలను నిమ్మరసం లేదా వెనిగర్‌తో కలిపి విరగొట్టి తయారు చేస్తారు. పనీర్ రుచికరమైనది మాత్రమే కాక అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. రోజూ పనీర్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదా, కాదా అన్న సందేహాలు చాలా మందిలో ఉంటాయి. మనం రోజూ పనీర్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, మొత్తం ఆరోగ్యంపై దాని ప్రభావం గురించి ఈ సందర్భంగా చర్చించే ప్రయత్నం చేద్దాం..

READ ALSO : High Uric Acid Level : యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు పాలక్ పనీర్ ఎందుకు తీసుకోకూడదు ?

ప్రొటీన్లు అధికం ;

పనీర్ లో ప్రోటీన్ అధిక మోతాదులో ఉంటుంది. శాకాహారులు ఇది అద్భుతమైన ఎంపిక. 100 గ్రాముల పనీర్‌లో 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది 100 గ్రాముల చికెన్‌లో ఉండే ప్రోటీన్ కంటెంట్‌కు సమానంగా చెప్పవచ్చు. శరీరంలోని కణజాలాలు, ఎంజైములు, హార్మోన్లు , కండరాలను నిర్మించడానికి , మరమ్మత్తు చేయడానికి ప్రోటీన్ అవసరమౌతుంది. ఇది ఆరోగ్యకరమైన జీవక్రియకు సహాయపడుతుంది. ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది, అనారోగ్యకరమైన ఆహారాలను తినాలనే కోరికను తగ్గిస్తుంది.

READ ALSO : Eggs vs Paneer : గుడ్లు vs పనీర్ ఈ రెండింటిలో ప్రొటీన్‌కు మంచి మూలం ఏది?

ఎముకల ఆరోగ్యానికి మంచిది ;

పనీర్‌లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా , ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కాల్షియం ఎముకల సాంద్రతను పెంచటంతోపాటు, ఎముకలు బలహీనంగా మరియు పెళుసుగా మారే బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని నివారిస్తుంది. ఇందులో ఉండే భాస్వరం ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి కాల్షియంతో కలిసి పనిచేస్తుంది. బోలు ఎముకల వ్యాధి వంటి ఎముక సంబంధిత వ్యాధులను వచ్చే ప్రమాదం ఉన్నవారికి ప్రతిరోజూ పనీర్ తీసుకోవడం ప్రయోజనకరం.

READ ALSO : Paneer Production : పనీర్ తయారీతో పాడి రైతులకు అదనపు ఆదాయం

బరువు తగ్గడంలో ;

పనీర్ మితంగా తీసుకుంటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పనీర్‌లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి.తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉంచుతుంది, అనారోగ్యకరమైన స్నాక్స్ తినాలనే కోరికను తగ్గిస్తుంది. ఈ ప్రోటీన్ జీవక్రియను పెంచడంలో , కొవ్వును కరిగించటంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. అలాగని పనీర్‌ను అధికంగా తీసుకోకపోవడం మంచిది. ఎక్కువగా తీసుకుంటే ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.

READ ALSO : Low Calorie Indian Recipes : బరువు తగ్గడానికి తక్కువ కేలరీలు కలిగిన భారతీయ వంటకాలు ఇవే !

రోగనిరోధక శక్తిని పెంచుతుంది ;

పనీర్ లో జింక్ అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు అవసరమైన ఖనిజం. తెల్ల రక్త కణాల ఉత్పత్తిలో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇన్ఫెక్షన్లు , వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. రోజూ పనీర్ తీనటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి, ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థను కు అవసరమైన విటమిన్ B12 ను కలిగి ఉంటుంది.

READ ALSO : Weight Loss : బరువు తగ్గే ప్రక్రియలో కేలరీలే ఎందుకు కీలకం !

గుండె ఆరోగ్యానికి మంచిది ;

పనీర్‌లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. రక్తపోటును నియంత్రించడంలో , గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది మోనోఅన్‌శాచురేటెడ్ ,పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులను కలిగి ఉంటుంది, ఇవి మంచి కొవ్వులు. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో , గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. పనీర్‌లో సోడియం కూడా తక్కువగా ఉంటుంది, ఇది గుండె ఆరోగ్యానికి మేలైన ఎంపికగా చెప్పవచ్చు.

READ ALSO : Protein Rich Foods : ఈ ప్రొటీన్ రిచ్ ఫుడ్స్ బరువు తగ్గించటంలో!

రోజువారీ పనీర్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే మితంగా తీసుకోవటం చాలా ముఖ్యం. అదనపు కేలరీలు తీసుకోకుండా రోజుకు 100-200 గ్రాముల పనీర్ తినాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. తక్కువ ఫ్యాట్ కలిగిన స్కిమ్డ్ మిల్క్ ను పనీర్‌ తయారీ కోసం ఎంచుకోవాలి.