Weight Loss : బరువు తగ్గే ప్రక్రియలో కేలరీలే ఎందుకు కీలకం !

శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకుంటే, అదనపు శక్తి కొవ్వుగా నిల్వ చేయబడుతుంది. దీని వల్ల బరువు పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. క్యాలరీలు తీసుకోకకుండా ఉండటం వల్ల శరీరం శక్తి కోసం కొవ్వు నిల్వలను కరిగించుకుంటాయి. ఫలితంగా బరువు తగ్గుతారు.

Weight Loss : బరువు తగ్గే ప్రక్రియలో కేలరీలే ఎందుకు కీలకం !

weight loss

Updated On : May 13, 2023 / 11:00 AM IST

Weight Loss : బరువు తగ్గే ప్రక్రియలో ఉన్నవారికి ఎలాంటి ఆహారం అవసరమో, అది ఎందుకు కీలకమో అనే విషయాల గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. బరువు తగ్గడం ఒక సవాలుతో కూడుకున్నది. అయితే అది అసాధ్యమైనదేమీకాదు. అదనపు బరువును తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన పద్ధతుల్లో ఒకటి క్యాలరీలను తగ్గించటం. కేలరీల లోటు అంటే శరీరం బర్న్ చేసే దానికంటే తక్కువ కేలరీలు తీసుకోవడం అని అర్ధం. తద్వారా బరువు తగ్గడం.

READ ALSO : Weight Loss And Fat Loss : బరువు తగ్గడం, కొవ్వు తగ్గడం మధ్య వ్యత్యాసం తెలుసా? ఆరోగ్యకరమైన శరీరం కోసం ఏంచేయాలంటే?

అయితే కేలరీల లోటు ఎక్కువగా ఉంటే ప్రమాదకరం. దానివల్ల ప్రతికూల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన మార్గంలో కేలరీల లోటు ద్వారా బరువు తగ్గేందుకు ప్రయత్నించటం చాలా ముఖ్యం.

కేలరీల లోటు ఎందుకు కీలకమైనది :

కేలరీల లోటు ముఖ్యమైనది కావడానికి అనేక కారణాలు ఉన్నాయి.

ఎనర్జీ బ్యాలెన్స్: శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకుంటే, అదనపు శక్తి కొవ్వుగా నిల్వ చేయబడుతుంది. దీని వల్ల బరువు పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. క్యాలరీలు తీసుకోకకుండా ఉండటం వల్ల శరీరం శక్తి కోసం కొవ్వు నిల్వలను కరిగించుకుంటాయి. ఫలితంగా బరువు తగ్గుతారు.

కొవ్వు కరగటం Vs కండరాల నష్టం : బరువు తగ్గటంలో క్యాలరీ లోటు కీలక పాత్ర పోషిస్తుంది. మితమైన కేలరీల లోటు ద్వారా శరీరం కొవ్వు నిల్వలను లక్ష్యంగా చేసుకుంటుంది. అయితే లీన్కం డర ద్రవ్యరాశి శక్తిని కాపాడుతుంది.

READ ALSO : Rose Tea : బరువు తగ్గడానికి రోజ్ టీ ఎలా ఉపయోగపడుతుంది? రోజ్ టీ తయారీ ఎలాగంటే ?

స్థిరంగా బరువు తగ్గడం : క్యాలరీ లోటు క్రమంగా , స్థిరంగా బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. ఒక మోతాదులో క్యాలరీ లోటు ద్వారా స్థిరంగా బరువు తగ్గవచ్చు, దీని వలన దీర్ఘకాలంలో బరువుతగ్గటంలో మంచి పురోగతి ఉంటుంది.

కేలరీల లోటు లక్ష్యాన్ని సాధించటం మెలా?

ఆహారంలో క్యాలరీలను తగ్గించటం పెద్ద కష్టమైన పనేంకాదు. డిన్నర్‌లో పనీర్ సలాడ్, చికెన్ సలాడ్ , గ్రీన్ సలాడ్‌లను తీసుకోవటం ద్వారా క్యాలరీలను సులభంగా తగ్గించుకోవచ్చు. నూనె వినియోగాన్ని తగ్గించటం ద్వారా క్యాలరీలను తగ్గించుకోవచ్చు.

READ ALSO : Millets : బరువు తగ్గటంతోపాటు ఆరోగ్యంగా ఉండాలన్నా తృణధాన్యాలే బెస్ట్!

ఉదాహరణకు శరీరానికి రోజువారీగా 1800 కేలరీలు అవసరమైతే , బరువు తగ్గడానికి 1500 కేలరీలు అవసరం అవుతాయి. దీనికిగాను రాత్రి భోజనాన్ని సలాడ్‌లతో భర్తీ చేయడం, నూనె వినియోగాన్నితగ్గించుకోవటం, ప్రధాన భోజనంలో పచ్చి కూరగాయలను తీసుకోవడం ద్వారా క్యాలరీలను తగ్గించుకోవచ్చు. శారీరక శ్రమతో, వ్యాయామంతో 200 కేలరీలు బర్న్ చేయవచ్చు. ఈ పద్ధతితో సులభంగా బరువు తగ్గవచ్చు.

బరువు తగ్గడంలో ప్రధాన కారకాల్లో క్యాలరీ లోటు ఒకటి అయినప్పటికీ , తీసుకునే ఆహారంపై కూడా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. కేలరీలు తగ్గించుకోవాలంటే శీతలపానీయాలు వంటి వాటిని తీసుకోకుండా కేలరీలు తక్కువగా ఉండే వాటిని తీసుకోవటం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు.