Millets : బరువు తగ్గటంతోపాటు ఆరోగ్యంగా ఉండాలన్నా తృణధాన్యాలే బెస్ట్!

తృణ ధాన్యాలను అధిక బరువు ఉన్న వారు, ఓబెసిటిని తగ్గించుకోవాలనుకునే తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బరువు సులభంగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

Millets : బరువు తగ్గటంతోపాటు ఆరోగ్యంగా ఉండాలన్నా తృణధాన్యాలే బెస్ట్!

millets are the best for losing weight and staying healthy!

Millets : తినే ఆహారం పైనే మన ఆరోగ్యం అన్నది ఆధారపడి ఉంటుంది . సమతుల్య ఆహారం తీసుకొంటే ఆరోగ్యంగా జీవితాన్ని గడిపేయవచ్చు. శరీరానికి అవసరమైన ప్రోటీన్‌లు, విటమిన్‌లు, కార్బోహైడ్రేడ్‌లు, మినరల్స్‌, కొవ్వులు అవసరమైన మేరకు తీసుకుంటే జబ్బులు దరిచేరవు. శరీరానికి సమతుల్యమైన పోషక పదార్థాలు లభ్యంకాదో అప్పటి నుండి శరీర పని తీరులో మార్పులు వస్తాయి.

శరీరానికి ప్రోటిన్‌లు అత్యవసరం. పాతరోజుల్లో రాగి అంబలి, జొన్న రొట్టె, సజ్జ సంకటి ఎక్కువగా వండి తినేవారు. ప్రస్తుతం కూడా ఇటువంటి తృణ ధాన్యాలను వివిధ ఆహార ఉత్పత్తుల్లో ఉపయోగిస్తున్నప్పటికి, రాగి అంబలి, జొన్న రొట్టె, సజ్జ సంకటి వంటి ఆహారాలను నేరుగా తినేటప్పుడు లభించే పోషకాలు ఈ ఆహార ఉత్పత్తులో అంతగా లభించవు.

తృణ ధాన్యాలలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్‌లు, విటమిన్ లు, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి విలువైన పోషకాలు అధికమోతాదులో లభిస్తాయి. అత్యధికంగా ప్రోటీన్‌లు, కాల్షియం, అధిక శాతంలో ఫైబర్‌ వంటి పోషక పదార్థాలు లభిస్తుండడంతో శరీరం వ్యాధి నిరోధక శక్తిని కలిగి వుంటుందని వైద్యులు సూచిస్తున్నారు. తృణ ధాన్యాలను మొలకలు తయారు చేసుకోని ఆహారంగా తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

వేరుశనగ, అలసందలు, పెసలను ఒక రోజు నానబెట్టి వాటిని రాత్రంతా ఉంచితే ఉదయానికి గింజలకు మొలకలు వస్తాయి. మొలకెత్తిన విత్తనాల్లో బి కాంప్లెక్స్‌కు సంబంధించిన విటమిన్‌లు మాత్రమే కాకుండా ఐరన్‌, క్యాల్సియమ్‌, ఫైబర్‌లు అధిక స్థాయిలో లభిస్తాయి. ఈ విత్తనాలతో పాటు రుచికరమైన క్యారేట్‌, బ్రీట్రూట్‌, దోసకాయలు జతచేసి ఉదయాన్నే అల్పాహారంగా తీసుకోవచ్చు.

తృణ ధాన్యాలను అధిక బరువు ఉన్న వారు, ఓబెసిటిని తగ్గించుకోవాలనుకునే తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బరువు సులభంగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. వీటిలోని పోషక విలువలు రక్తం శుద్దికి దోహదపడుతాయి. చర్మం మృదువుగా ఉండేందుకు కూడా బాగా ఉపయోగపడుతాయి. ఈ తృణ ధాన్యాలల్లో అవసరమైన పోషకాలు ఉండడంతో వీటిని  అందాన్ని కాపాడుకోవడానికి, చర్మ సౌందర్యానికి ఆహారంగా తీసుకోవచ్చు. చిన్నారుల నుండి వృద్ధుల వరకు ఆరోగ్యాన్ని సంరక్షించు కోవడానికి జొన్నలు, రాగులు, గోధుమలు, సజ్జలు వంటి తృణ ధాన్యాలు మనకు ఎంతో మేలు చేస్తాయి.

తృణ ధాన్యాలు అటు ఆరోగ్యాన్ని అందివ్వటంతో పాటు, తినడానికి రుచి గా కూడా వుంటాయి. సులభంగా జీర్ణమవుతాయి. జీర్ణ వ్యవస్థకు, కాలేయానికి మేలుకలిగిస్తాయి. మంచి ఆరోగ్యాన్నిస్తాయి. అంతేకాకుండా వీటిల్లో ఉండే ఐరన్ రక్తహీనతను పొగొడుతుండగా, మెగ్నీషియం మైగ్రేన్ తలనొప్పి, గుండె సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది. కాల్షియం ఎముకల పటుత్వాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలనూ దూరం చేస్తుంది.

ఇంకా తృణధాన్యాల్లో విటమిన్ బి3, అమినో ఆసిడ్ కొలెస్టరాల్ ను అదుపులో ఉంచుతుంది. ఆకలిని తగ్గించి ఒబెసిటి దరి చేరకుండా చూస్తుంది. ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీంతో మలబద్దకం దూరమవుతుంది. వీటిలో ఉండే ఆంటి ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడి క్యాన్సర్ కారకాలను బయటికి పంపి మంచి ఆరోగ్యానికి తోడ్పడుతాయి.