High Uric Acid Level : యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు పాలక్ పనీర్ ఎందుకు తీసుకోకూడదు ?

అధిక యూరిక్ యాసిడ్ కంటెంట్ ఉన్న వ్యక్తులు పాలక్ పనీర్ తినకూడదు, ఎందుకంటే పాలక్, పనీర్ రెండు అధిక ప్రోటీన్ మూలాలను కలిగి ఉంటాయి, వీటిని కలిపినప్పుడు శరీరంలో ప్యూరిన్ స్థాయి పెరుగుతుంది.

High Uric Acid Level : యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు పాలక్ పనీర్ ఎందుకు తీసుకోకూడదు ?

high uric acid

Updated On : June 25, 2023 / 11:22 AM IST

High Uric Acid Level : పాలక్ పనీర్ చాలా మంది ఇష్టపడే రుచికరమైన భారతీయ వంటకం. ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా దీనిని తీసుకోవటం వల్ల కలుగుతాయి. అయితే, ఇది కొంతమందికి ఏమాత్రం సరైంది కాదు. ఇదే విషయాన్ని ఆయుర్వేదం సైతం స్పష్టంగా చెబుతుంది. అధిక యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్న వారు పాలక్ పనీర్ ను తీసుకోక పోవటమే మంచిది.

READ ALSO : Uric Acid : యూరిక్ యాసిడ్ సమ్యతో బాధపడుతున్నవారు ఎలాంటి ఆహారాలు తీసుకోవటం బెటర్!

యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే పాలక్ పనీర్ ఎందుకు తినకూడదు?

అధిక యూరిక్ యాసిడ్ కంటెంట్ ఉన్న వ్యక్తులు పాలక్ పనీర్ తినకూడదు, ఎందుకంటే పాలక్, పనీర్ రెండు అధిక ప్రోటీన్ మూలాలను కలిగి ఉంటాయి, వీటిని కలిపినప్పుడు శరీరంలో ప్యూరిన్ స్థాయి పెరుగుతుంది. ఈ ప్యూరిన్ రాళ్ల రూపంలో శరీరంలో చేరి యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే సమస్యలను పెంచుతుంది. ఇది మాత్రమే కాదు, అధిక యూరిక్ యాసిడ్ స్థాయిల వల్ల కలిగే గౌట్ సమస్యను కూడా పెంచుతుంది, ఇది ఎక్కువ వాపు, నొప్పికి దారితీస్తుంది.

READ ALSO : Uric Acid : శరీరంలో యూరిక్ యాసిడ్ స్ధాయిలు తగ్గించే జ్యూస్ లు ఇవే!

యూరిక్ యాసిడ్‌ సమస్యతో బాధపడేవారిలో పాలక్ పనీర్ దుష్ప్రభావాలు ;

యూరిక్ యాసిడ్‌ సమస్యతో బాధపడేవారిలో పాలక్ పనీర్ తినడం వల్ల శరీరంలో ప్రోటీన్ స్థాయిలు అస్థిరంగా పెరగుతాయి. అంతే కాకుండా యూరిక్ యాసిడ్ నిల్వలు అధికమవుతాయి. దీని వల్ల నిలబడటం కూడా కష్టతరమవుతుంది. నొప్పి బాగా బాధిస్తుంది. దానితో పాటు, ఈ ప్రోటీన్ జీవక్రియను దెబ్బతీస్తుంది. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే పాలక్ పనీర్ తినడం మానుకోవటం మంచిది. దీనికి బదులుగా ముతక ధాన్యాలు, కూరగాయలు , బొప్పాయి వంటి అధిక ఫైబర్ ఆహారాలు తినడంపై దృష్టి సారించాలి. విటమిన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.