Uric Acid : యూరిక్ యాసిడ్ సమ్యతో బాధపడుతున్నవారు ఎలాంటి ఆహారాలు తీసుకోవటం బెటర్!

పండ్లు, కూరగాయలు, బీన్స్‌ మీ డైట్‌లో ఎక్కువగా చేర్చుకోండి. మీ ఆహారంలో తృణధాన్యాలు తీసుకోండి. లీన్‌ ప్రోటిన్‌ ఉండే.. చికెన్‌, టర్కీ, చేపలు, టోఫూ తింటే మంచిది. సంతృప్త కొవ్వు ఉండే రెడ్‌ మీట్‌కు దూరంగా ఉండండి. యూరిక్ యాసిడ్ పేషెంట్లు బాదంపప్పును ఎక్కువగా తినాలి.

Uric Acid : యూరిక్ యాసిడ్ సమ్యతో బాధపడుతున్నవారు ఎలాంటి ఆహారాలు తీసుకోవటం బెటర్!

uric acid

Uric Acid : యూరిక్‌ యాసిడ్‌ మన రక్తంలో ఉండే వ్యర్థ పదార్థం. మన శరీరంలో ప్యూరిన్‌ అనే రసాయనం విచ్ఛిన్నం అయినప్పుడు ఇది తయారవుతుంది. ఇది ఎప్పటికప్పుడు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. విసర్జన సరిగా జరగకపోతే యూరిక్‌ యాసిడ్‌ రక్తంలోనే ఉంటుంది. క్రమేపి స్ఫటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోతాయి. దీని కారణంగా గౌట్‌ వ్యాధి వస్తుంది. ఇది అర్థరైటిస్‌లా ఉంటుంది. గౌట్‌ సమస్య కారణంగా కీళ్లలో నొప్పుల వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి.

యూరిక్‌ యాసిడ్‌ సమస్యను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే ఎముకలు, కీళ్లు, కణజాలం దెబ్బతినే ప్రమాదం ఉంది. శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ ఎక్కువగా ఉంటే కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. యూరిక్‌ యాసిడ్‌ సమస్య కారణంగా టైప్‌ 2 డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌, ఫ్యాటీ లివర్‌ వంటి సమస్యలు వచ్చే ముప్పు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.లైఫ్‌స్టైల్‌ మార్పులు చేసుకుని, మంచి ఆహారం తీసుకుంటే.. యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలను తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గితే, యూరిక్‌ యాసిడ్‌ స్థాయులు తగ్గుతాయని అంటున్నారు. యూరిక్‌ యాసిడ్‌ పేషెంట్స్ ఫ్లూయిడ్స్‌ ఎక్కువగా తీసుకోవటం వల్ల ప్రయోజనం ఉంటుంది.

ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే ;

పండ్లు, కూరగాయలు, బీన్స్‌ మీ డైట్‌లో ఎక్కువగా చేర్చుకోండి. మీ ఆహారంలో తృణధాన్యాలు తీసుకోండి. లీన్‌ ప్రోటిన్‌ ఉండే.. చికెన్‌, టర్కీ, చేపలు, టోఫూ తింటే మంచిది. సంతృప్త కొవ్వు ఉండే రెడ్‌ మీట్‌కు దూరంగా ఉండండి. యూరిక్ యాసిడ్ పేషెంట్లు బాదంపప్పును ఎక్కువగా తినాలి. ఇది మీకు మంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం, కాపర్, విటమిన్ కె, ప్రొటీన్, జింక్ ఉంటాయి. కీళ్ల నొప్పులు, వాపుల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. జీడిపప్పులో పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. వాల్‌నట్‌లను సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. ఇందులో యాంటీ-ఆక్సిడెంట్లు, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి మీ శరీరం నుంచి యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది.

యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారికి అరటిపండు వినియోగం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అరటిపండ్లను రోజూ తీసుకుంటే, ప్యూరిన్ పరిమాణం ఖచ్చితంగా దీని కంటే తక్కువగా ఉంటుంది. చెర్రీస్ యూరిక్ యాసిడ్‌ తగ్గించటంలో సహాయకారిగా తోడ్పడుతుంది. ఇది ఆంథోసైనిన్ అనే మూలకాన్ని కలిగి ఉంటుంది, అదేవిధంగా యాంటీఆక్సిడెంట్ల గొప్ప లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి శరీరం వాపును తగ్గించడంలో ఉపకరిస్తుంది. యూరిక్ యాసిడ్ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు అవకాడో కూడా మేలు చేస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అలాగే విటమిన్ ఇ ,యాంటీ ఇన్‌ఫ్లమేటరీని కలిగి ఉంటుంది. చేపలలో ఒమేగా – 3 ప్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొన్ని సీఫుడ్‌లలో ప్యూరిన్‌‌ ఎక్కువగా ఉంటుంది. గౌట్‌ సమస్య ఉన్నవారు. చేపలకు పూర్తిగా దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. షెల్ఫిష్, సార్డినెస్, ఆంకోవీస్ చేపలను తక్కువగా తీసుకోండి. వీటిలో ప్యూరిన్‌ ఎక్కువగా ఉంటుంది.

ఈ ఆహారాలు అసలే వద్దు ;

యూరిక్ యాసిడ్‌తో బాధపడేవారు కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రస్సెల్స్ మొలకలు, పుట్టగొడుగులను తినకూడదు. ఎందుకంటే ఇందులో ప్యూరిన్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. ప్రోటీన్ వంటి ఆహారాన్ని త్యాగం చేయవలసి ఉంటుంది. యూరిక్ యాసిడ్ ఉన్న రోగులకు ప్రోటీన్-రిచ్ ఫుడ్ హానికరం. పాలు, పెరుగు, కిడ్నీ బీన్స్, పచ్చి బఠానీలు, బచ్చలికూర, కాయధాన్యాలు మొదలైన వాటిని తీసుకోవడం మానుకోండి. కూల్‌ డ్రింక్స్‌, ఆల్కహాల్‌, ప్యాట్‌ జ్యూస్‌లు తాగకూడదు.