Dragon Fruit Farming : అమెరికన్ బ్యూటీ రకం డ్రాగన్ ఫ్రూట్ సాగు

Dragon Fruit Farming : ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు అమెరికన్ బ్యూటీ రకం డ్రాగన్ ప్రూట్ ను ఎంచుకొని 3 ఎకరాల్లో సాగుచేస్తూ.. స్థానికంగానే మార్కెట్ చేసుకొంటూ.. మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.

dragon fruit farming techniques and management

Dragon Fruit Farming : డ్రాగన్ ఫ్రూట్.. పెట్టుబడి ఎక్కువే అయినా.. నాటిన 25, 30 ఏళ్ల పాటు దిగుబడి వస్తుండటంతో రైతులు వీటి సాగుకు మొగ్గుచూపుతున్నారు. అంతే కాదు శ్రమ తక్కువ..  కూలీల అవసరం పెద్దగా ఉండదు. చీడపీడలు అసలే బెడద అసలే ఉండదు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తరించింది. ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు అమెరికన్ బ్యూటీ రకం డ్రాగన్ ప్రూట్ ను ఎంచుకొని 3 ఎకరాల్లో సాగుచేస్తూ.. స్థానికంగానే మార్కెట్ చేసుకొంటూ.. మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు 

ఒకప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అంటే మార్కెట్ లో యమ డిమాండ్ ఉండేది. కిలో 300 ల వరకు పలికేది. అందుకే  రైతులు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేపట్టారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎకరం, అరఎకరంలోనో  డ్రాగన్ ఫ్రూట్ సాగు కనబడుతూనే ఉంది. అయితే దీనికి పెట్టుబడి ఎక్కువే అయినా.. దిగుబడి నాటిన 25 నుండి 30 ఏళ్ల వరకు వస్తుంది కాబట్టి రైతులు వీటి సాగుకు మొగ్గుచూపారు. దీంతో దిగుబడి పెరిగింది. మార్కెట్ లో పండ్ల ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అయినా నష్టంలేదంటూ.. సాగుచేస్తూనే ఉన్నారు.

ఈ కోవలోకే ఏలూరు జిల్లా, కొయ్యలగూడెం మండలం, పొంగుటూరుకు చెందిన రైతు పసుపులేటి పెంటయ్య.. తన మూడు ఎకరాల వ్యవసాయ భూమిలో అమెరికన్ బ్యూటీ రకం డ్రాగన్ ఫ్రూట్ ను సాగుచేస్తున్నారు. మొదటి పంట దిగుబడి కొద్ది మొత్తంలో వచ్చినా.. రెండో ఏడాది పెరిగింది. ప్రస్తుతం మూడో పంట తీసేందుకు సిద్ధమవుతున్నారు.. ఈ సారి మంచి దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన దిగుబడిని స్థానిక వ్యాపారులు తోటవద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు.

Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు

ట్రెండింగ్ వార్తలు