Buffalo Dairy Farming : గేదెల డెయిరీతో లక్షల ఆదాయం పొందుతున్న రైతు

ఆర్థికంగా ఎదగాలంటే బాగా చదివి ఉద్యోగాలే చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా కష్టపడేతత్వం, మరికొంత పెట్టుబడి ఉంటే సరిపోతుందని నిరూపిస్తున్నారు

Farmer Earning Profits from Buffalo Dairy Farming

Buffalo Dairy Farming : వ్యవసాయానికి అనుబంధంగా, రైతుకు శాశ్వత ఉపాధిని కల్పిస్తున్న రంగం పాడి పరిశ్రమ. పెట్టిన పెట్టుబడినిబట్టి, పెంచే పశు జాతినిబట్టి ఈ రంగంలో రైతులు లాభాలు ఆర్జిస్తుంటారు. పాడి పరిశ్రమలో నష్టం వచ్చిందంటే అది కచ్చితంగా మన స్వయంకృతాపరాధమే.  పశుపోషణను ఉపాధిగా మలుచుకుని, కంటికి రెప్పలా ఈ పరిశ్రమను వెన్నంటి వున్న వారికి లాభాలకు కొదవ వుండదని నిరూపిస్తున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు.

ఆర్థికంగా ఎదగాలంటే బాగా చదివి ఉద్యోగాలే చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా కష్టపడేతత్వం, మరికొంత పెట్టుబడి ఉంటే సరిపోతుందని నిరూపిస్తున్నారు ఏలూరు జిల్లా, కొయిలగూడెం మండలం, అంకాల గూడెం గ్రామ రైతు ఏడుకొండలు.

తన ఇద్దరు మిత్రులతో కలిసి డెయిరీ ఫాం నెలకొల్పారు.  స్థానిక బ్రీడ్ గేదెలతో పాటు హర్యాణ నుండి తెచ్చిన ముర్రాజాతి గేదెలతో డెయిరీ నిర్వహిస్తున్నారు. గేదెలే కాకుడా 4 రకాల ఆవులను సైతం పెంచుతున్నారు. ఒక పాల ఉత్పత్తిపైనే ఆదారపడకుండా.. దూడల పునరుత్పత్తిపై శ్రద్ధ వహించడంతో డెయిరీ దినదినాభివృద్ధి చెందుతోంది. వచ్చిన పాలను స్థానికంగానే అమ్ముతూ.. విజయపథంలో పయనిస్తున్నారు.

గేదెలు అధిక పాలు ఇచ్చేందుకుకు అధిక పోషక విలువలున్న పశుగ్రాసాలను అందిస్తున్నారు.  పచ్చిగడ్డితో పాటు ఎండిగడ్డి వేయడమే కాకుండా మినరల్ మిక్సర్ ను కూడా అందిస్తున్నారు.

Read Also : Sugarcane Cultivation : జంట చాళ్ల పద్ధతిలో చెరకుసాగు చేస్తే అధిక దిగుబడి