Sugarcane Cultivation : జంట చాళ్ల పద్ధతిలో చెరకుసాగు చేస్తే అధిక దిగుబడి

Sugarcane Cultivation : తెలుగు రాష్ట్రాల్లో చెరకు పంటను సుమారు 1 లక్షా 89 వేల హెక్టార్లలో సాగుచేస్తూ ఉంటారు. 

Sugarcane Cultivation : జంట చాళ్ల పద్ధతిలో చెరకుసాగు చేస్తే అధిక దిగుబడి

Double Row System In Sugarcane Cultivation

Updated On : November 5, 2024 / 3:00 PM IST

Sugarcane Cultivation : వాణిజ్య పంటల్లో చెరకు ప్రధానమైంది. చెరకు ద్వారా ఉత్పత్తయ్యే పంచదార, బెల్లం ప్రజల నిత్యావసరాల్లో ముఖ్యమైనవి. అంతటి ప్రాధాన్యతగల చెరకు సాగు విస్తీర్ణం కొంతకాలంగా గణనీయంగా తగ్గుతోంది. ఫలితాలు నిరాశాజనకంగా వుండటంతో ఈ పంటకు బదులు రైతులు ఇతర వాణిజ్యపంటలపై దృష్టిసారిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా చెరకు సాగు విస్తీర్ణం తగ్గుముఖం పట్టింది.  అయితే చెరకును జంట చాళ్ల పద్ధతిలో సాగుచేస్తే మంచి దిగుబడులను తీయవచ్చంటున్నారు అనకాపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు. మరి ఆ సాగు వివరాలేంటో ఇప్పుడు చూద్దాం…

తెలుగు రాష్ట్రాల్లో చెరకు పంటను సుమారు 1 లక్షా 89 వేల హెక్టార్లలో సాగుచేస్తూ ఉంటారు.  చెరకు పంట ద్వారా చక్కర, బెల్లం, ఖండసారి, మొలాసిస్ , ఫిల్టర్ మడ్డి ఉత్పత్తి అవుతుంది. అధిక దిగుబడి పొందాలంటే అనువైన శితోష్ణస్థితులు, రకాలు, సాగుభూమి, సాగు పద్ధతులు, సస్యరక్షణ, సాగునీరు లాంటి అంశాలు ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో చెరకు విస్తీర్ణం తగ్గడానికి కూలీల కొరత, నీటి ఎద్దడి తోపాటు దిగుబడి తగ్గడం కూడా కారణమైంది.

ఈ నేపధ్యంలో చెరకులో తక్కువ నీరు, తక్కువ విత్తనంతో, అధిక దిగుబడి సాధించే విధంగా శాస్త్రవేత్తలు జంటచాళ్ల విధానాన్ని అభివృద్ధి చేసారు. ఈ విధానంలో పంట తొలిదశలో అంతర పంటల సాగు ద్వారా కూడా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చు. కూలీల అవసరం లేకుండా యంత్రాలతో చెరకును నరికే వీలుంటుంది. దీనివల్ల తక్కువ ఖర్చుతో రైతులు మంచి ఫలితాలు సాధించవచ్చని విశాఖ జిల్లా, అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. చిత్కళాదేవి చెబుతున్నారు.

చెరకులో నీటివనరును పొదుపుగా , సమర్ధ నిర్వాహనతో వృధా కాకుండా వాడుకోవడంతో అధిక ప్రయోజనం పొందవచ్చు. ముఖ్యంగా చెరకు పంటకు పిలక దశ అత్యంత కీలకమైనది. ఈ సమయంలో తేమ చాలా అవసరం. ఈ దశ వేసవిలో రావటం వలన పంటపై ఒత్తిడి ఏర్పడి పిలకల సంఖ్య గణనీయంగా తగ్గడమే కాకుండా దిగుబడిపై ప్రభావం చూపనుంది. పరిమిత నీటి వనరులలో బిందు సేద్య పద్ధతి పాటించడం వలన నీటి వినియోగ సామర్థ్యం పెరిగి అంతరపంటల సాగు ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.

Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..