Dragon Fruit Cultivation : ప్రకృతి విధానంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు.. పంట మార్చాడు.. లాభాలు ఆర్జిస్తున్నాడు

Dragon Fruit Cultivation : తెలుగు రాష్ట్రాల్లో పండ్లతోటల సాగు విస్తీర్ణం ఇటీవల కాలంలో పెరుగుతోంది. ఇందుకు కారణం వ్యవసాయంలో కూలీల కొరత తో పాటు పెరిగిన పెట్టుబడులనే చెప్పాలి.

Farmer Earns Huge Profit With Dragon Fruit Cultivation

Dragon Fruit Cultivation : తీర ప్రాంతాలలో డ్రాగన్ ఫ్రూట్ సాగు పెరుగుతుంది. ముఖ్యంగా సంప్రదాయ పంటల సాగులో లాభాలు లేకపోవడంతో చాలా మంది రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు  మొగ్గు చూపుతున్నారు. మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న, పంటలనే ఎంచుకుంటున్నారు. ఈ కోవలోనే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు డ్రాగన్ ఫ్రూట్ సాగుచేస్తూ.. మంచి ఫలితాలను పొందుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పండ్లతోటల సాగు విస్తీర్ణం ఇటీవల కాలంలో పెరుగుతోంది. ఇందుకు కారణం వ్యవసాయంలో కూలీల కొరత తో పాటు పెరిగిన పెట్టుబడులనే చెప్పాలి. అందుకు చాలా మంది సంప్రదాయ పంటల స్థానంలో తోటలను నాటుతున్నారు. ఇందులో ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు అధికపాళ్ళనే చెప్పాలి. ఒక్కసారి నాటితే దీర్ఘకాలంపాటు దిగుబడి రావడమే కాకుండా.. కూలీలు, శ్రమ తక్కువగా ఉంటుంది. అంతే కాదు చీడపీడల బెడద అసలే ఉండదు.

ఎరువులు, పురుగు మందులు పిచికారి చేయాల్సిన పనే లేదు. అందుకే తూర్పుగోదావరి జిల్లా, నల్లజర్ల మండలం, నబీపేట గ్రామానికి చెందిన రైతు యద్ధనపూడి లక్ష్మణస్వామి గత ఏడాది ఎకరంలో తైవాన్ జంబో రకం డ్రాగన్ ఫ్రూట్ ను నాటారు. నాటిన ఏడాదే కొద్ది మొత్తంలో దిగుబడిని తీసిన ఆయన ప్రస్తుతం రెండో ఏడాది పంట దిగుబడిని తీస్తున్నారు. ఇతర పంటలతో పోల్చితే డ్రాగన్ ఫ్రూట్ సాగు బాగుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..