Vegetables Cultivation : ప్రత్యామ్నాయ పంటగా బీరసాగు చేస్తున్న రైతులు

నేలబారు సాగులో కూరగాయలు కుళ్లిపోవడంతో పాటు మచ్చలు ఏర్పడి, నాణ్యత లోపించటం వల్ల మార్కెట్‌లో ధర రాక నష్టపోయిన  సందర్భాలు అనేకం.  ఈ క్రమంలో  శాశ్వత  పందిర్లు, నిలువు పందిర్లు ఏర్పాటు చేసుకుని తీగజాతి కూరగాయలను పండిస్తూ తక్కువ సమయంలో,  నిత్యం ఆదాయం పొందుతున్నారు .

alternative crop

Vegetables Cultivation : సంప్రదాయ సాగు పద్ధతులు రైతులను నిరాశకు గురిచేస్తున్నాయి. దీంతో చాలామంది రైతులు ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ముఖ్యంగా పందిర్లపై కూరగాయల సాగు లాభాల పంట పండిస్తోంది. అందుకే చాలామంది రైతులు శాశ్వత పందిర్లు, నిలువు పందిర్లు ఏర్పాటు చేసుకొని బీరసాగుతో సత్ఫలితాలు సాధిస్తున్నారు.

READ ALSO : Keeping Bones Healthy : ఎముకలను ఆరోగ్యంగా ఉంచటంలో కీలకపాత్ర పోషించే ఇనుముతోపాటు ఇతర విటమిన్లు !

సాగు విధానంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను అందిపుచ్చుకుంటున్న రైతులు నాణ్యమైన కూరగాయలు పండిస్తున్నారు. నేలబారు సాగులో కూరగాయలు కుళ్లిపోవడంతో పాటు మచ్చలు ఏర్పడి, నాణ్యత లోపించటం వల్ల మార్కెట్‌లో ధర రాక నష్టపోయిన  సందర్భాలు అనేకం.  ఈ క్రమంలో  శాశ్వత  పందిర్లు, నిలువు పందిర్లు ఏర్పాటు చేసుకుని తీగజాతి కూరగాయలను పండిస్తూ తక్కువ సమయంలో,  నిత్యం ఆదాయం పొందుతున్నారు .

READ ALSO :Types Of Soils : ఏ నేలల్లో ఏఏ పంటలు సాగుచేయాలి ? నేలల రకాలు.. పంటల ఎంపిక

ఈ కోవలోనే ఆదిలాబాద్ జిల్లా, తాంసికి చెందిన రైతు జీవన్ స్థానికంగా దొరికే కర్రలను ఉపయోగించి  అతి తక్కువ ఖర్చుతో నిలువు పందిరి విధానంలో 30 గుంటల స్థలంలో బీరసాగును చేపట్టారు. నాణ్యతతో కాయదిగుబడి రావడంతో మార్కెట్ లో మంచి ధర పలుకుతోందని చెబుతున్నారు.

READ ALSO : TTDP: తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోతే ప్రత్యామ్నాయమేంటి?

పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లు మండలం, వడ్లవాని పాలెం గ్రామానికి చెందిన రైతు కూడా బీరసాగు చేపడుతున్నారు. పందిరి నిర్మాణానికి ప్రారంభపు పెట్టుబడి ఎక్కువగా ఉన్న , పంటకాలం ఎక్కువగా ఉండటం, నాణ్యమైన అధిక దిగుబడి వస్తుండటంతో.. ఈ విధానంలో మంచి ఫలితాలు వస్తున్నాయంటున్నారు. దీనికి తోడు ధర కలిసివచ్చిన సంధర్బాల్లో లాభాల బాటలో పయనించవచ్చని చెబుతున్నారు.