Farming Techniques Of Okra Crop
Okra Crop : బెండ పంట వేసుకునేందుకు అన్ని కాలాలు అనుకూలం. తక్కువ నీటితో ఆరుతడిగా పండించుకునే పంటల్లో ఇదొకటి. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో రైతులు బెండను విత్తారు. నూటికి 90 శాతం మంది రైతులు హైబ్రిడ్ బెండ రకాలపై ఆధారపడుతున్నారు కాబట్టి, పోషక యాజమాన్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. బెండలో అధిక దిగుబడులు సాధించడం కోసం చేపట్టాల్సిన ఎరువుల యాజమాన్యం గురించి, ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞానం కేంద్రం శాస్త్రవేత్త డా. క్రిష్ణవేణి ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం..
READ ALSO : Ginger Seed Collection : అల్లం విత్తన సేకరణలో జాగ్రత్తలు
బెండ ఏడాది పొడవున సాగయ్యే పంట. 4 నెలలు కాలపరిమితి కలిగిన ఈ పంటలో హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి వచ్చాక, రైతులు ఎకరాకు 50 నుంచి 100 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. ఏడాదిలో ఎక్కువ రోజులపాటు మార్కెట్ ధర నిలకడగా కొనసాగటం వల్ల రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఈ పంటలో పల్లాకు తెగులును తట్టుకునే రకాలు, హైబ్రిడ్లు అందుబాటులో వుండటంతో రైతులు స్థిరమైన ఆదాయం గడించే అవకాశం ఏర్పడింది.
బెండలో ప్రధానంగా రసం పీల్చు పురుగుల నివారణ పట్ల రైతులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ తెగులు వ్యాప్తి వుండదు. ప్రతి వారం 10 రోజులకు ఒకనీటి తడి అందిస్తే నాటిన 45వ రోజు నుంచి బెండ దిగుబడి ప్రారంభమవుతుంది. సకాలంలో పోషకాలు అందించినప్పుడు పైరు ఆరోగ్యంగా, అధిక వ్యాధి నిరోధక శక్తితో పెరిగి దిగుబడినిచ్చే కాలం పెరుగుతుంది.
READ ALSO : Trichoderma viride : ట్రైకోడెర్మా విరిడె తో తెగుళ్ల నివారణ
ప్రస్తుతం మార్కెట్లో కిలో బెండకు 20 రూపాయల ధర రైతుకు లభిస్తోంది. మార్కెట్ కు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించుకొని, శాస్త్రవేత్తల సలహాలు , సూచనలు పాటిస్తే బెండ సాగులో.. అధిక దిగుబడులను పొందవచ్చు.