Sugarcane Crop
Sugarcane Crop : తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న వాణిజ్యపంటల్లో చెరకు ప్రధానమైనది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో నాటిన చెరుకు ఆరు నుండి ఎనిమిది నెలల వయస్సులో వుంది. ఈ దశలో భారీవర్షాలు, ఈదురుగాలులు వస్తే తీవ్రనష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి జడచుట్లు ద్వారా చెరకు తోటలను కాపాడుకోవాలని సూచిస్తున్నారు, మెదక్ జిల్లా , బసంత్ పూర్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త, డా. విజయ్ కుమార్.
READ ALSO : Sugarcane Cultivation : చెరకు సాగులో మెళకువలు
తెలుగు రాష్ట్రాలలో అధిక విస్థీర్ణంలో సాగవుతున్న వాణిజ్య పంట చెరకు. 12నెలలపాటు కొనసాగే ఈ దీర్ఘకాలపు పంటను కొంతమేర వర్షాధారంగాను, అధిక శాతం నీటి పారుదల కింద సాగుచేస్తున్నారు. ప్రస్తుతం 6 నుండి 8 నెలల దశలో చెరకు తోటలు ఉన్నాయి. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో ఈదురు గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
READ ALSO : Intercrop Cultivation : పామాయిల్ లో అంతర పంటగా చెరకు సాగు
చెరకు పడిపోతే గడలపై కణుపుల వద్ద, కొత్త పిలకలు వచ్చి, దిగుబడి తగ్గిపోతుంది. పడిపోయిన తోటల్లో ఎలుకలు, పందులు చేరి నష్టాన్ని కలుగచేస్తాయి. చెరకు తోటలు పడినప్పుడు గడలపై పగుళ్లు ఏర్పడి పంచదార దిగుబడులు తగ్గిపోతాయి. దుబ్బులు ఎండిపోయి, కార్శి పంటలో దిగుబడులు తగ్గుతాయి. అందువల్ల బాగా ఎదిగిన చెరకు తోటలు పడిపోకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో వివరిస్తున్నారు మెదక్ జిల్లా, బసంత్ పూర్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త, డా. విజయ్ కుమార్.
READ ALSO :Sugarcane Crop : చలికాలంలో చెరకు పంటకు నష్టం కలిగించే తుప్పు తెగులు, నివారణ మార్గాలు!
జడచుట్టు వేసేటప్పుడు భూమిలో తగినంత పదును ఉండాలి. లేదంటే గడలు విరిగిపోయే ప్రమాదం ఉంది. మొవ్వులోని 8 పచ్చని ఆకులను వదిలి, మిగిలిన ఆకులను విరిచి జడచుట్టు వేయాలి. పంట పెరిగేకొద్దీ రెండు నుండి 3 వరుసల్లో జడచుట్లు వేయవచ్చు. దీనివల్ల దిగుబడితో పాటు పంచదార దిగుబడి కూడా పెరుగుతుంది.