government teacher growing dragon fruit
Dragon Fruit : ఆయనొక ప్రభుత్వ ఉపాద్యాయుడు. ఒక వైపు స్కూల్లో పిల్లలకు పాఠాలు చెబుతూనే.. మరోవైప వ్యవసాయం చేస్తున్నారు. ముఖ్యంగా తనకున్న ఎకరంలో ప్రయోగాత్మకంగా డ్రాగన్ ఫ్రూట్ సాగుచేస్తూ.. మంచి దిగుబడులు తీస్తున్నారు. వచ్చిన దిగుబడులను స్థానికంగానే అమ్ముతూ.. అధిక లాభాలు ఆర్జిస్తున్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల సాగులో కూడా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయంలో కూలీల సమస్య, పెరిగిన పెట్టుబడులను తగ్గించుకుంటూ.. తక్కువ శ్రమతో దీర్ఘకాలం లాభాలను ఆర్జించే పంటలను రైతులు ఎంచుకుంటున్నారు. ఇలాంటి పంటల్లో ముఖ్యమైనవి పండ్లతోటలు. అయితే, ఇటీవల ప్రతి రైతు ఎంతో కొంత విస్తీర్ణంలో డ్రాగన్ ప్రూట్ సాగు చేపడుతున్నారు.
ఇలా సాగు చేపట్టిన వారిలో ఆదిలాబాద్ జిల్లా, జైనథ్ మండలం, కౌట గ్రామానికి చెందిన రైతు ప్రశాంత్ ఒకరు. గవర్నమెంట్ టీచర్ అయినప్పటికీ వ్యవసాయంపై ఉన్న మక్కువతో తనకున్న ఎకరం పొలంలో రెండున్నర సంవత్సరాల క్రితం డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను నాటారు. ప్రస్తుతం పంట దిగుబడిని పొందుతున్నారు. వచ్చిన దిగుబడిని స్థానికంగానే అమ్ముతున్నారు. ఇతర పంటలతో పోల్చితే డ్రాగన్ ఫ్రూట్ సాగు మంచి లాభదాయంగా ఉందంటున్నారు.
Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..