Green Gram Cultivation : రబీకి అనువైన పెసర రకాలు.. అధిక దిగుబడుల కోసం సాగులో మేలైన యాజమాన్యం

ఆంద్రప్రదేశ్ లో రబీ పంటగా కృష్ణా, గోదావరి, దక్షిణ మండలం, ఉత్తర కోస్తా మండలాల్లో అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు. కృష్ణా, గోదావరి మండలాల్లో వరిమాగాణుల్లో నవంబర్ నుండి డిసెంబర్ మొదటి వారం వరకు విత్తుకునే అవకాశం ఉంది.

Green Gram Cultivation

Green Gram Cultivation : తక్కువ  పెట్టుబడి.. తక్కువ సమయంలో అందివచ్చే అపరాలపంట పెసర.  దీనిసాగు రైతులకు అన్ని విధాలా కలసివస్తోంది. సాగు ఆరంభం నుంచే ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకుని, సమయానుకూలంగా  యాజమాన్య పద్ధతులు  పాటించినట్లయితే ఎకరాకు 6 నుండి 7 క్వింటాళ్ళ వరకు దిగుబడులు పొందవచ్చు. ప్రస్థుతం రబీ పంటగా పెసరను సాగుచేసే రైతులు  ఎన్నుకోవాల్సిన రకాలు.. చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ శ్రీలత.

READ ALSO : Vegetable Crops : వర్షాకాలంలో వేసుకోదగ్గ కూరగాయ పంటలు… చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు

పెసర పంటను వర్షాధారంగా, నీటిపారుదల కింద 3 కాలాల్లోను రైతులు సాగుచేస్తుంటారు. అంతే కాదు ఏకపంటగాను, అంతర పంటగాను సాగుచేసుకునే వెసులు బాటు ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ వరకు  విత్తుకోవచ్చు. ఖరీఫ్ వరి తరువాత నవంబర్ 15 నుండి డిసెంబర్ మొదటి వారం వరకు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో విత్తుకోవచ్చు.

READ ALSO : Telangana : వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటలు వేసుకోవాలి

ఆంద్రప్రదేశ్ లో రబీ పంటగా కృష్ణా, గోదావరి, దక్షిణ మండలం, ఉత్తర కోస్తా మండలాల్లో అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు. కృష్ణా, గోదావరి మండలాల్లో వరిమాగాణుల్లో నవంబర్ నుండి డిసెంబర్ మొదటి వారం వరకు విత్తుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రబీ పంటగా మెట్టప్రాంతాల్లో.. వరిమాగాణుల్లో సాగుచేయాలనుకునే రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకోవాలని వివరాలు తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ శ్రీలత.

READ ALSO : Types Of Soils : ఏ నేలల్లో ఏఏ పంటలు సాగుచేయాలి ? నేలల రకాలు.. పంటల ఎంపిక

పెసర పంట తొలిదశలో చీడపీడల బెడదను అధిగమించేందుకు విత్తన శుద్ధి చాలా ముఖ్యం . దీనిద్వారా విత్తిన 20 నుండి 20 రోజుల వరకు ఎటువంటి రసాయన మందులు వాడకుండా పంటను కాపాడుకోవచ్చు. అలాగే భూమిద్వారా వ్యాపించే శిలీంధ్ర తెగుళ్ల నుండి కూడా పంటను రక్షించుకోవచ్చు.  అలాగే ఎలాంటి ఎరువులను ఏ సమయంలో అందించాలో తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త.