Green Leafy Vegetables : వేసవిలో ఆకుకూరలకు మంచి డిమాండ్.. అధిక దిగుబడుల కోసం శాస్త్రవేత్తల సూచనలు

ముఖ్యంగా మార్కెట్ లో ఆకు కూరలు నాణ్యత ఉంటేనే ప్రజలు తొందరగా కొనటమే కాదు, మంచి రేటు కూడా పలుకుతుంది. కాబట్టి రైతు అలాంటి నాణ్యత కోసం సకాలంలో కలుపు, ఎరువులు, చీడపీడల నివారణ చేపట్టాలి. ఆకు కూరల్లో ముఖ్యంగా పాలకూర కు మంచి డిమాండ్ ఉంటుంది.

Green Leafy Vegetables Cultivation

Green Leafy Vegetables : ఏడాది పొడవునా ఆకుకూరలకు డిమాండు ఉంటుంది. కొత్తిమీర, మెంతి, పుదీనా, తోటకూర, గోంగూర, బచ్చలి, చుక్కకూర వంటివి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేవి కనుక రోజువారీ వంటల్లో తప్పనిసరి అయ్యాయి. అంతేగాక హోటళ్లలో వీటికున్న డిమాండు తగ్గకపోగా పెరుగుతుంది. మరీ ముఖ్యంగా తోటకూర, పాలకూరకు ఏడాది పొడవునా గిరాకీ బాగా ఉంటుంది. ఆకుకూరల సాగు మెట్ట ప్రాంతాలలో అనుకూలమైన లాభాలను అందిస్తాయి.

READ ALSO : Cultivation Of Vegetables : వేసవిలో కూరగాయల సాగు, రైతులు పాటించాల్సిన మెళుకువలు !

ఆకు కూరలను సంవత్సరం పొడవునా సాగుచేసుకోనేందుకు  పొలాన్ని చిన్నచిన్న మడులుగా చేసుకుని పశువుల ఎరువుతో పాటు, తగిన మోతాదులో రసాయన ఎరువులు వాడుతూ ఆకు కూరల్ని సాగుచేసుకోవచ్చు . మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులు వున్నా, ఆకు కూరల సాగులో నష్టాలకు మాత్రం తావుండదు. ఎందుకంటే ప్రతి 15 నుంచి 20 రోజులకు పంటచేతికొస్తుంది . ఒకసారి కాకపోతే మరోసారి రేటు కలిసొచ్చే అవకాశం వుంది.

అందుకే ఎక్కువగా నగరాలు, పట్టణాలకు సమీపంలో ఉన్న రైతులు ఎకరం, అరెకరం భూమిలో సైతం ఏడాది పొడవునా ఆకు కూరలు సాగుచేసి మంచి ఫలితాలను సాధిస్తున్నారు. నెలనెలా డబ్బు చేతికొస్తుండటంతో పెట్టుబడికి, జీవనోపాధికి కొదవ ఉండదు. అయితే ఈ ఆకు కూరల సాగులో అధిక దిగుబడులు సాధించడానికి పలు సూచనలు చేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం, శాస్త్రవేత్తలు.

READ ALSO : High Moisture Corn : మొక్కజొన్నలో తేమ వల్ల నష్టం జరగకుండా నివారిస్తే!

ముఖ్యంగా మార్కెట్ లో ఆకు కూరలు నాణ్యత ఉంటేనే ప్రజలు తొందరగా కొనటమే కాదు, మంచి రేటు కూడా పలుకుతుంది. కాబట్టి రైతు అలాంటి నాణ్యత కోసం సకాలంలో కలుపు, ఎరువులు, చీడపీడల నివారణ చేపట్టాలి. ఆకు కూరల్లో ముఖ్యంగా పాలకూర కు మంచి డిమాండ్ ఉంటుంది. పాలకూరలో శరీరానికి అవసరమైన ఇనుము ఫుష్కలంగా ఉండి రక్తహీనతను తగ్గిస్తుంది. అంతే కాదు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  ఇందులో మిటమిన్  సి, ఏ లతో పాటు మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్లు ఉండటం వలన క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. అలాంటి ఈ ఆకు కూరను సాగుచేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడులను సాధించవచ్చు.

READ ALSO : Pests In Sorghum : జొన్నలో చీడపీడల నివారణ చర్యలు !

సమయానుకూలంగా డిమాండ్‌కు తగ్గట్టు కూరగాయలను సాగు చేస్తూ అధికలాభాలు పొందేలా రైతులు అడుగులు వేయాలి. ముఖ్యంగా తక్కువ కాలంలో పంట చేతికి వచ్చి, ఆర్థికంగా ఆసరాగా నిలిచే ఆకుకూరలు పండించాలి. దళారులు లేకుండా నేరుగా మార్కెట్లో అమ్మితే మంచి లాభాలు ఆర్జించవచ్చని తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం, శాస్త్రవేత్తలు డా. సుధా జాకబ్. పూర్తి వివరాలకు క్రింది వీడియోపై క్లిక్ చేయండి.

 

ట్రెండింగ్ వార్తలు