Cultivation Of Vegetables : వేసవిలో కూరగాయల సాగు, రైతులు పాటించాల్సిన మెళుకువలు !

వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం , వడ గాలులు వీయడం, బావుల్లో నీటి మట్టం తగ్గడం, విద్యుత్‌సరఫరాలో అంతరాయాలు ఏర్పడటం వంటి కారణాలు కూరగాయల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. కాబట్టి నీటి సౌకర్యం ఉన్న రైతులు అధిక ఉష్ణోగ్రతల్లో సైతం, కూరగాయ పంటలు సాగు చేసి మంచి లాభాలను పొందవచ్చు.

Cultivation Of Vegetables : వేసవిలో కూరగాయల సాగు, రైతులు పాటించాల్సిన మెళుకువలు !

Cultivation of vegetables in summer, techniques to be followed by farmers!

Cultivation Of Vegetables : వేసవి కాలంలో కూరగాయలు దొరకటం కష్టం. ఏ రకం కూరగాయ అయినా కిలో కనీసం రూ.40 నుండి 60 పలుకుతున్నది. ఏ కూరగాయ పండించినా ఫుల్‌ డిమాండ్‌ఉంటుంది. మంచి లాభాలు రావాలంటే వేసవిలో కూరగాయలే సాగు చేయాలి. సాధారణంగా కూరగాయల సాగులో రూపాయి పెట్టుబడి పెడితే 3 రూపాయలకు పైనే ఆదాయం వస్తుంది. కానీ వేసవిలో అదే కూరగాయలు సాగుచేస్తే, అధిక లాభాలు వస్తాయి.

READ ALSO : winter vegetable cultivation : శీతాకాలం కూరగాయల సాగులో మెళుకువలు!

వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో ఉండే తక్కువ తేమ , కూరగాయలసాగుకు ప్రతిబంధకమవుతుంది. వీటిని అధిగమించి వేసవిలో కూరగాయలను సాగుచేసి లాభాలు పొందాలంటే, రైతులు వేసవికి అనువైన కూరగాయల రకాలను ఎన్నుకోవాలి. వేసవిలోని అధిక ఉష్ణోగ్రత, వడగాల్పుల వల్ల మొక్క పెరుగుదల తక్కువగా ఉండి, పూత, పిందె తగ్గి తద్వారా దిగుబడులు తగ్గుతాయి. అందువల్ల రైతులు కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్దతులను చేపట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

READ ALSO : Green Pepper And Garlic Solution : కూరగాయల పంటల్లో శనగపచ్చ పురుగు, లద్దె పురుగు నివారణకు పచ్చి మిర్చి వెల్లుల్లి ద్రావణం!

అయితే వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం , వడ గాలులు వీయడం, బావుల్లో నీటి మట్టం తగ్గడం, విద్యుత్‌సరఫరాలో అంతరాయాలు ఏర్పడటం వంటి కారణాలు కూరగాయల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. కాబట్టి నీటి సౌకర్యం ఉన్న రైతులు అధిక ఉష్ణోగ్రతల్లో సైతం, కూరగాయ పంటలు సాగు చేసి మంచి లాభాలను పొందవచ్చు. అయితే వేడిని తట్టుకునే రకాల ఎంపికతో పాటు, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించటం వల్లే, ఆశించిన ఫలితాలు వస్తాయని తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్.

ముఖ్యంగా కూరగాయలు, ఆకుకూరల సాగులో అధిక దిగుబడిని పొందాలంటే ఎరువుల యాజమాన్యం కీలకం. సెమీ ఆర్గానిక్ పద్ధతిలో రసాయన ఎరువులతోపాటు సేంద్రియ ఎరువులను కూడా వాడినట్లైతే భూసారం పెరిగి మంచి దిగుబడులు వచ్చేందుకు ఆస్కారం ఉంటుందని కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్ అంటున్నారు. పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో పై క్లిక్ చేయండి.