winter vegetable cultivation : శీతాకాలం కూరగాయల సాగులో మెళుకువలు!

శీతాకాలంలో నీటి సౌకర్యం ఉంటేనే సాగు చేపట్టాలి. చీడ, పీడలను తట్టుకుని దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకోవటం మంచిది. ఆయా ప్రాంతాల్లో సాగుకు అనుకూలంగా ఉండే వంగడాలనే వాడాలి.

winter vegetable cultivation : శీతాకాలం కూరగాయల సాగులో మెళుకువలు!

Techniques in winter vegetable cultivation!

winter vegetable cultivation : కూరగాయల సాగుకు శీతాకాలం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో ముఖ్యంగా దుంపజాతి కూరగాయలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ , టమాట, మిరప, వంట వంటి పంటలను సాగుకు అనుకూలంగా ఉంటాయి. వీటి సాగు రైతులకు అధిక ఆదాయాన్ని సమకూరుస్తాయి. ఈ సీజన్ లో దిగుబడులు కూడా అధికంగా ఉంటాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

శీతాకాలంలో నీటి సౌకర్యం ఉంటేనే సాగు చేపట్టాలి. చీడ, పీడలను తట్టుకుని దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకోవటం మంచిది. ఆయా ప్రాంతాల్లో సాగుకు అనుకూలంగా ఉండే వంగడాలనే వాడాలి. రబీలో చలి ఎక్కువగా ఉండటం వల్ల సూక్ష్మధాతు పోషకాలు లోపించే అవకాశాలు ఎక్కువ. కాబట్టి సూక్ష్మధాతు ఎరువులను సిద్థం చేసుకోవాలి. కూరగాయల సాగులో హైబ్రీడ్‌ విత్తనాల వల్ల దిగుబడులు పెరుగుతాయి.నాణ్యత లేని విత్తనాలు మార్కెట్‌లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి విత్తనాలు కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

వంగ, మిరప, టమాటలో నారు కుళ్లు తెగులు అధికంగా ఉంటుంది. దీంతో మొక్కలు ఎక్కువగా చనిపోతాయి. ఇది నీటి ద్వారా ఇతర నారు మొక్కలకు కూడా సోకి అన్ని చనిపోతాయి. కనుక ఎత్తైన నారుమడులు తయారు చేసుకుని నారు పెంచుకోవాలి. ఎకరంలో నాటడానికి సరి పోయే విత్తనం పెంచడానికి నాలుగు మీటర్ల పొడవు, మీటరు వెడల్పు ఉన్న నారు మడులు 8 నుంచి 10 కావాలి. వీటిని భూమిపై నుంచి 15 సెం. మీటరు ఎత్తులో ఉండేలా తయారు చేయాలి. ఇలా చేయటం వల్ల నీరు నారులో నిల్వకుండా బయటకెళ్తుంది.

విత్తన మొలక శాతం పరీక్షించిన తర్వాతే నారుమడులు పెంచుకోవాలి. విత్తనాల్లో మొలక శాతం 70 శాతం కంటే ఎక్కువగా ఉండాలి. గింజలను పేపర్‌లో వరుసగా ఒకదాని పక్కన మరొకటి పెట్టి పేపరు చుట్టాలి. ఆతర్వాత చీకట్లో ఉంచి ఉదయం, సాయంత్రం పూట నీటితో తడిచేయాలి. ఎన్ని మొలకెత్తితే అంత శాతంగా నిర్థారించుకోని విత్తనాల నాణ్యతను నిర్ధారించుకోవాలి. నారుమడిలో విత్తే ముందు విత్తనశుద్ధి చేస్తే, తెగుళ్ల నుంచి పంటను కాపాడుకోవచ్చు.