Green Manure Cultivation : పచ్చిరొట్ట పైర్లు.. ఉపయోగాలు

నేలలను పునరుజ్జీవింప జేయడానికి సేంద్రియ ఎరువులను వాడాల్సిన అవసరం ఉన్నది. మరోవైపు పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు వంటి సేంద్రియ ఎరువుల లభ్యత సామాన్య రైతులకు భారంగా మారుతున్నది. ఈ నేపథ్యంలో జనుము, జీలుగ, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట సాగు మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది.

Green Pears And Its Uses

Green Manure Cultivation : ఆధునిక వ్యవసాయం రైతన్నకు లాభాలు తెచ్చినా, భూమి తల్లికి మాత్రం తీరని నష్టాన్ని కలిగిస్తున్నది. అధిక దిగుబడులే లక్ష్యంగా రసాయన ఎరువుల వాడకం.. నేల స్థితిగతులనే మార్చేస్తున్నది. నేలల్లో చౌడు శాతాన్ని పెంచడంతోపాటు సహజ లక్షణాలనూ దెబ్బ తీస్తున్నది. ఫలితంగా నీటిని నిల్వ చేసుకొనే సామర్థ్యాన్ని సాగుభూమి క్రమంగా కోల్పోతున్నది. అందుకే, పచ్చిరొట్ట పైర్ల సాగుతో ఈ సమస్యలనుండి గట్టెక్కవచ్చని వ్యవసాయ నిపుణులు తెలియజేస్తున్నారు.

READ ALSO : Green Manure Cultivation Tips : భూసారం పెరిగేందుకు దోహదపడుతున్న పచ్చిరొట్టపైర్లు

అధునాతన వ్యవసాయంలో మితిమీరి రసాయన ఎరువులు వాడటం వల్ల పసిడిపంటలు పండే భూములు సహజ శక్తిని కోల్పోతున్నాయి. సాగుకు యోగ్యం కాకుండా తయారవుతున్నాయి. ముఖ్యంగా భూమిలో స్వతహాగా లభ్యమయ్యే పోషకాల్లో అసమానతలు ఏర్పడి, పంటలో సూక్ష్మపోషకాల లోపాలు బయటపడుతున్నాయి. ఫలితంగా భారీ పెట్టుబడులు పెట్టిన రైతులు తగిన దిగుబడి లేక నష్టపోవాల్సి వస్తున్నది.

ఇలాంటి పరిస్థితుల్లో నేలలను పునరుజ్జీవింప జేయడానికి సేంద్రియ ఎరువులను వాడాల్సిన అవసరం ఉన్నది. మరోవైపు పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు వంటి సేంద్రియ ఎరువుల లభ్యత సామాన్య రైతులకు భారంగా మారుతున్నది. ఈ నేపథ్యంలో జనుము, జీలుగ, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట సాగు మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది.

READ ALSO : Soil Fertile : పచ్చిరొట్ట పైర్ల సాగు… నేల సారవంతం బహుబాగు

ఈ పంటలను పొలాల్లో పెంచి, నేలలోనే కలియ దున్నడం వల్ల భూసారం పెరుగుతుంది. కలుపు నివారణతో పాట అధిక దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉందని రైతులకు తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా , ఎలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం డా. శీరిష.