Green Manure Cultivation Tips : భూసారం పెరిగేందుకు దోహదపడుతున్న పచ్చిరొట్టపైర్లు

పశుల ఎరువు లభ్యత తక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పచ్చిరొట్ట పైర్లు రైతులకు సులభమైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. వ్యవసాయంలో రైతులు పూర్తిగా రసాయనిక ఎరువుల పైనే ఆధారపడుతున్నారు. దీంతో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

Green Manure Cultivation Tips : భూసారం పెరిగేందుకు దోహదపడుతున్న పచ్చిరొట్టపైర్లు

Green Manure Cultivation Tips

Green Manure Cultivation Tips : రసాయన ఎరువుల వాడకం నానాటికి పెరిగి, భూసారం దెబ్బతింటుంది. పంటల సాగుకు పనికి రాకుండా పోతోంది. ఎంత పెట్టుబడి పెట్టినా, దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జీలుగ, జనుము, పిల్లి పెసర లాంటి పచ్చిరొట్ట పంటలను పెంచి నేలలో కలియదున్నడం ద్వారా భూసారం పెంచుకోవచ్చు.

READ ALSO : Ridge Gourd Cultivation : వేసవి బీరసాగులో పాటించాల్సిన మెళకువలు !

అంతే కాదు పశుల ఎరువు లభ్యత తక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పచ్చిరొట్ట పైర్లు రైతులకు సులభమైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. వ్యవసాయంలో రైతులు పూర్తిగా రసాయనిక ఎరువుల పైనే ఆధారపడుతున్నారు. దీంతో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. సేంద్రీయ ఎరువులు వాడక పోవటం వల్ల, భూసారం తగ్గి , దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి. పెట్టుబడి భారం పెరుగుతోంది.

ఈసమస్యలను అధిగమించడానికి, ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట ఎరువులను రుతుపవనాల ఆరంభంలో వేసుకోవాలి. అవకాశాన్నిబట్టి మే నెలలో ఈ పైర్లను వేసుకుంటే భూసారాన్ని పెంచుకునే వీలుంది. అంతే కాకుండా, వర్షాకాలంలో భూమి కోతకు గురి కాకుండా అరికట్టవచ్చు. భూమిలో తేమ, పోషకాల శాతాన్ని పెంచుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

READ ALSO : Bottle Gourd Cultivation : సొరకాయ సాగులో అధిక దిగుబడి సాధించేందుకు మెళుకువలు

ఆహార దాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించినప్పటికీ, పంటల సాగులో విచక్షణా రహితంగా వినియోగించే రసాయనాల ద్వారా, అనేక అనార్థాలు సంభవిస్తున్నాయి. నేల భౌతిక లక్షణాలు దెబ్బతిని, నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోతున్నాయి. సూక్ష్మ పోషక లోపాలు తరచుగా కనబడుతున్నాయి. ఉత్పాదకత తగ్గి, ఖర్చు పెరిగిపోతుంది.

ఈ నేపధ్యంలో నేల సహజత్వాన్ని కాపాడుతూ, అధిక దిగుబడులు సాధించేందుకు పచ్చిరొట్ట పైర్లు ఎంతగానో సహకరిస్తాయి. రైతులందరూ వీటిని సాగుచేసి నేల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా పెట్టుబడులు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని శ్రీకాకుళం జిల్లా, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత డా. నీలవేణి చెబుతున్నారు.

READ ALSO : Rose Cultivation : గులాబీ సాగులో మెళుకువలు, కొమ్మల కత్తిరింపుతో అధిక దిగుబడి!