Ground Nut Cultivation : రబీలో వరికి ప్రత్యామ్నాయంగా వేరుశనగ సాగు.. పంటలో చేపట్టాల్సిన యాజమాన్యం

Ground Nut Cultivation : తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఖరీఫ్ వరి కోతల తర్వాత రబీలో రైతులు వేరుశనగను సాగుచేయటం ఆనవాయితీగా వుంది. రబీలో వేరుశనగను నీటి వసతి కింద సాగు చేస్తారు కనుక ఖరీఫ్ కంటే ఎక్కువ దిగుబడులు నమోదుచేస్తున్నారు.

Ground Nut Cultivation

Ground Nut Cultivation : నూనెగింజల పంటల్లో ప్రధానమైన పంట వేరుశనగ. ముఖ్యంగా తెలంగాణలో రబీలో వరికి ప్రత్యామ్నాయంగా వేరుశనగను, అధిక విస్తీర్ణంలో సాగుచేశారు రైతులు. అయితే ప్రస్తుతం పంట 30 నుండి 40 రోజుల దశలో ఉంది.

ఈ సమయంలో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం, శాస్త్రవేత్త, విజయ్ కుమార్. తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఖరీఫ్ వరి కోతల తర్వాత రబీలో రైతులు వేరుశనగను సాగుచేయటం ఆనవాయితీగా వుంది. రబీలో వేరుశనగను నీటి వసతి కింద సాగు చేస్తారు కనుక ఖరీఫ్ కంటే ఎక్కువ దిగుబడులు నమోదుచేస్తున్నారు.

Read Also : Ladies Finger Cultivation : బెండతోటలకు మొజాయిక్ వైరస్ ఉధృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

తేలిక నేలలు ఎర్రచెలక నేలల్లో, రైతులు వేరుశనగ సాగు చేపట్టారు. ఒక్క తెలంగాణలోనే 2 లక్షా హెక్టార్లలోల వేరుశనగ సాగవుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అక్టోబర్ 15 వరకు , దక్షిణ తెలంగాణలో నవంబర్ 15 వరకు విత్తుకున్నారు రైతులు. ప్రస్తుతం పంట వివిధ ప్రాంతాల్లో 20 నుండి 40 రోజుల దశలో ఉంది. అయితే ప్రస్తుతం చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి రైతులకు తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం, శాస్త్రవేత్త, విజయ్ కుమార్.

కలుపు యాజమాన్యం : 

విత్తిన 48 గంటల్లో ఎకరాకు

పెండిమిథాలిన్ 1 లీ. పిచికారి చేయాలి

కలుపు యాజమాన్యం : 

ఎకరాకు ఇమాజిత్ ఫిర్ 300 మి. లీ.

200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి

ఎరువుల యాజమాన్యం : 

ఎకరాకు సింగిల్ సూపర్ ఫాస్పేట్ 4 బస్తాలు, యూరియా అరబస్తా

ఎరువుల యాజమాన్యం :

30 -40 రోజుల దశలో ఎకరాకు జిప్సం 200 కిలోలు మొక్క మొదలు దగ్గర వేయాలి

Read Also : Mango Cultivation : మామిడిలో పురుగులు, తెగుళ్ల బెడద నివారణ చర్యలు

ట్రెండింగ్ వార్తలు