Groundnut Cultivation Guide in Telugu
Groundnut Cultivation : తెలంగాణా రాష్ట్రంలో రబీపంటగా తెలంగాణలో వేరుశనగను అధిక విస్తీర్ణంలో రైతులు సాగుచేస్తున్నారు. ఇప్పటికే నీటివసతి ఉన్న చోట పంటను విత్తారు. అయితే నాణ్యమైన అధిక దిగుబడిని పొందాలంటే తొలిదశనుండే మేలైన యాజమాన్యం చేపట్టాలి.
ముఖ్యంగా కలుపు యాజమాన్యం, ఎరువులు యాజమాన్యం, నీటితడులు సమయానుకూలంగా అందించాలని సమగ్ర యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్త శ్రవంతి.
వర్షాధార వ్యవసాయంలో రైతుకు కొన్ని ఇబ్బందులు వున్నా… రబీలో నీటిపారుదల కింద చేపట్టే యాజమాన్యం, పూర్తిస్థాయిలో రైతు నియంత్రణలో వుంటుంది. కనుక రబీ వేరుశనగసాగులో మంచి ఫలితాలు పొందే వీలుంది. సాధారణంగా మనకు అందుబాటులో వున్న రకాలన్నీ 12క్వింటాళ్లకు పైబడి దిగుబడి నిస్తున్నాయి.
ఇసుకతోకూడిన గరపనేలలు, నీరు ఇంకే స్వభావం వున్న ఎర్రచల్కానేలలు ఈ పంటసాగుకు శ్రేష్ఠమైనవి. అయితే తొలిదశలో ఆశించే చీడపీడల నివారణకు తప్పకుండా విత్తనశుద్ధి చేయాల్సి ఉంటుంది. అయితే మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే, రైతులు ఆశించిన దిగుబడులు పొందవచ్చంటూ వేరుశనగ సాగులో మెలకువలు తెలియజేస్తున్నారు, పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్త శ్రవంతి.
Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..