Ladies Finger Cultivation : బెండతోటలకు మొజాయిక్ వైరస్ ఉధృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

Ladies Finger Cultivation : నీటి వసతికింద మే నెల చివరి వారంలో విత్తిన బెండతోటల్లో మొజాయిక్ వైరస్ వ్యాప్తి అధికంగా కనిపిస్తోంది. దీన్ని అధిగమించే చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Ladies Finger Cultivation

Ladies Finger Cultivation : సంవత్సరం పొడవునా స్థిరమైన, నమ్మకమైన ఆదాయాన్ని అందించే కూరగాయ పంట బెండ. ఎకరాకు 80 నుండి 100 క్వింటాళ్ల దిగుబడినిచ్చే ఈ పంటను రైతులు అన్నికాలాల్లోను సాగుచేస్తున్నారు. అయితే ఈ పంటకు ప్రధాన సమస్య ఎల్లోవీన్ మొజాయిక్ వైరస్. నివారణ లేని ఈ వైరస్ ఉధృతి పెరిగితే, పంటపై పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందే. నీటి వసతికింద మే నెల చివరి వారంలో విత్తిన బెండతోటల్లో మొజాయిక్ వైరస్ వ్యాప్తి అధికంగా కనిపిస్తోంది. దీన్ని అధిగమించే చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Red Gram Cotton Cultivation : మిగ్‌‌జామ్ తుఫాన్.. పత్తి, కందిలో చేపట్టాల్సిన యాజమాన్యం

బెండ ఉష్ణ మండల పంట. నీటిపారుదల కింద రైతులు సంవత్సరం పొడవునా ఈ కూరగాయను సాగుచేస్తున్నారు. మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులున్నా ఒకసారి కాకపోతే మరోసారి రేటు కలిసొస్తుండటంతో రైతులకు, సాగు లాభదాయకంగా మారింది. తొలకరి పంటగా జూన్ నుంచి ఆగష్టు వరకు ఈ పంటను విత్తుకోవచ్చు. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు అందుబాటులో వుండటంతో రైతులు ఎకరాకు 10టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నారు. బెండ పంటకాలం 90 రోజులు. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే 4 నెలల వరకు దిగుబడి తీయవచ్చు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో మే చివరి వారం నుండి బెండను విత్తారు. బెట్ట పరిస్థితులు ఏర్పడటం వల్ల ఈ తోటల్లో రసంపీల్చు పురుగుల ఉధృతి పెరిగింది. దీంతో బెండకు ప్రధాన శత్రువైన ఎల్లోవీన్ మొజాయిక్ వైరస్ ఉధృతమైంది. దీన్ని తొలిదశలోనే గుర్తించి వెంటనే దీన్ని అధిగమించేందుకు సత్వర చేపట్టాలని సూచిస్తున్నారు కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వి.రత్నాకర్.

ఎల్లోవీన్ మొజాయిక్ వైరస్ తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది కనుక తోటలో తెల్లదోమను గమనించిన వెంటనే తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తెల్లదోమ నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి వారం రోజుల వ్యవధితో రెండు సార్లు పిచికారిచేయాలి. పిచికారీచేసే ముందు కోతకు వచ్చిన కాయలను కోసివేస్తే కాయల్లో పురుగు మందుల అవశేషాలు లేకుండా నాణ్యంగా వుంటాయి.

Read Also : Redgram Cultivation : కందిలో పెరిగిన చీడపీడల ఉధృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ట్రెండింగ్ వార్తలు